Telugu Global
National

రేషన్ సరకుల్ని బొక్కేసిన బీజేపీ సర్కార్.. మధ్యప్రదేశ్‌లో భారీ స్కాం..

మహిళా శిశు అభివృద్ధి శాఖ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ చేతిలోనే ఉంది. ఆ శాఖలో అవినీతి కంపు ఇప్పుడు బయటపడింది. చౌహాన్ కనుసన్నల్లోనే ఈ భారీ స్కాం జరిగినట్టు ఆరోపణలు వినపడుతున్నాయి.

రేషన్ సరకుల్ని బొక్కేసిన బీజేపీ సర్కార్.. మధ్యప్రదేశ్‌లో భారీ స్కాం..
X

మహిళలు, పిల్లల పౌష్టికాహార పంపిణీలో అవినీతి, అక్రమాలు జరిగాయంటే దానికి బాధ్యుల్ని ప్రభుత్వం శిక్షించాలి. కానీ ఆ అవినీతికి కారణం ముఖ్యమంత్రే అయితే దానికి జవాబుదారీ ఎవరు..? మధ్యప్రదేశ్ లోని బీజేపీ హయాంలో ఇదే జరిగింది. మహిళా శిశు అభివృద్ధి శాఖ, సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ చేతిలోనే ఉంది. ఆ శాఖలో అవినీతి కంపు ఇప్పుడు బయటపడింది. చౌహాన్ కనుసన్నల్లోనే ఈ భారీ స్కాం జరిగినట్టు ఆరోపణలు వినపడుతున్నాయి.

2018లో లబ్ధిదారుల సంఖ్య 9వేలు.. 2021లో 36.08 లక్షలు

ఈ ఒక్క ఉదాహరణ చాలు మధ్యప్రదేశ్‌లో ఏ రేంజ్‌లో రేషన్ సరకుల స్కాం జరిగిందో చెప్పడానికి. మహిళలు, పిల్లలకు పౌష్టికాహారాన్ని పంపిణీ చేస్తున్నట్టు లెక్కల్లో చూపించి ఆ సొమ్మునంతా బొక్కేసింది బీజేపీ సర్కారు. కనీసం ఆ 9 వేల మందికైనా సక్రమంగా సరకులు పంపిణీ అయ్యాయా అంటే అదీ లేదు. మధ్యప్రదేశ్‌లో పౌష్టికాహార లోపంతో బాధపడుతున్న మహిళలు, బడిఈడు పిల్లల సంఖ్య అధికంగా ఉంది. అంటే ఈ స్కాంతో కేవలం డబ్బులే పోలేదు. ప్రజల ఆరోగ్యాన్ని కూడా పణంగా పెట్టారు.

బైక్‌లు, ఆటోల నంబర్లతో టోకరా..

పోషకాహార పథకంలో భాగంగా ఉత్పత్తి ప్లాంట్ల నుంచి గతేడాది 1,125.64 మెట్రిక్‌ టన్నుల రేషన్‌ సరుకులను సరఫరా చేశారు. రవాణా కోసం ట్రక్కులకు రూ.6.94 కోట్లు ఖర్చు చేశారు. అయితే, ట్రక్కులుగా లెక్కలో చూపిన వాహనాలు బైకులు, కార్లు, ఆటోలు, ట్యాంకర్లుగా రిజిస్ట్రేషన్‌ అయ్యాయి. అంటే ఇక్కడ వాహనాలు లేవు, సరకు కూడా లేదు. కేవలం పేపర్ మీదే సరకు డెలివరీ అయింది, ఆ సొమ్ము సీఎం జేబులో పడింది. కేవలం రవాణా రూపంలోనే కోట్ల రూపాయలు మాయ చేసిన కేటుగాళ్లు, అసలు సరకునే లేకుండా చూపించి ఇంకెన్ని కోట్లు బొక్కేశారనేది తేలాల్సి ఉంది.

పాఠశాల చిన్నారులకు అందించే ఉచిత ఆహారం పథకంలో అవినీతి జరిగినట్లు మధ్యప్రదేశ్‌ అకౌంటెంట్‌ జనరల్‌ రూపొందించిన 36 పేజీల నివేదిక ఇప్పుడు బయటకు రావడంతో అక్కడ కలకలం రేగింది. 2021కి సంబంధించిన టేక్ హోమ్ రేషన్ పథకంలో దాదాపు 24 శాతం మంది లబ్ధిదారుల వివరాలను పరిశీలించి ఈ నివేదిక తయారు చేశారు. భారీ స్కాంని బయటపెట్టారు.

First Published:  5 Sep 2022 4:30 AM GMT
Next Story