Telugu Global
National

మధ్యప్రదేశ్ అసెంబ్లీ బరిలో కేంద్ర మంత్రులు, ఎంపీలు

రెండు విడతల్లో బీజేపీ 79మంది అభ్యర్థుల పేర్లు ప్రకటించింది. అందులో సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ పేరు లేకపోవడం విశేషం. ఇది ఆయనకు ఘోర అవమానం అంటూ కాంగ్రెస్ సెటైర్లు పేలుస్తోంది.

మధ్యప్రదేశ్ అసెంబ్లీ బరిలో కేంద్ర మంత్రులు, ఎంపీలు
X

మధ్యప్రదేశ్ లో మరోసారి అధికారంలోకి రావాలని చూస్తున్న బీజేపీ భారీ వ్యూహంతో బరిలో దిగుతోంది. ఇప్పటికే 79మంది అభ్యర్థులతో రెండు జాబితాలు ప్రకటించింది. ముగ్గురు కేంద్ర మంత్రులు, నలుగురు ఎంపీలను కూడా అసెంబ్లీ బరిలో దించింది బీజేపీ. ఈ వ్యూహం ఏమేరకు లాభం చేకూర్చుతుందో అనే అనుమానాలున్నా కూడా ప్రయోగానికే బీజేపీ అధిష్టానం సిద్ధపడింది.

సీఎం సీటు సంగతేంటి..?

రెండు విడతల్లో బీజేపీ 79మంది అభ్యర్థుల పేర్లు ప్రకటించింది. అందులో సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ పేరు లేకపోవడం విశేషం. ఇది ఆయనకు ఘోర అవమానం అంటూ కాంగ్రెస్ సెటైర్లు పేలుస్తోంది. స్థానిక నాయకత్వాన్ని పక్కనపెట్టి, కేంద్ర నాయకత్వానికి బీజేపీ పెద్ద పీట వేస్తోంది. ఎంపీలు, కేంద్ర మంత్రుల్ని రంగంలోకి దించుతోంది. అయితే ఇలా అసెంబ్లీ బరిలో దిగడం చాలామందికి ఇష్టం లేదు. కానీ బీజేపీ అధిష్టానం వారిని బలవంతంగా అసెంబ్లీకి పోటీ చేయిస్తోంది.

రెండో జాబితాలో ఇండోర్-1 నుంచి స్థానం దక్కించుకున్న కైలాష్ విజయవర్గీయ తనకు పోటీచేసే ఉద్దేశం లేదని బహిరంగంగానే చెబుతున్నారు. అయినా కూడా అధిష్టానం ఆయనపై ఒత్తిడి తెస్తోంది. నరేంద్ర సింగ్ తోమర్, ఫగ్గన్ సింగ్ కుల స్తే, ప్రహ్లాద్ సింగ్ పటేల్ కేంద్ర మంత్రులుగా ఉన్నా కూడా వారిని మధ్యప్రదేశ్ బరిలో దింపింది అధిష్టానం. ఈ నిర్ణయంపై వారు కూడా రగిలిపోతున్నారు. ఈ ప్రయోగాలు దేనికోసమో బీజేపీ పెద్దలకే తెలియాలి. రాష్ట్రం నుంచి చాలామంది ఆశావహులున్నా కూడా అధిష్టానం వారిని పక్కనపెట్టింది. గత ఎన్నికల్లో బీజేపీకి చావు తప్పి కన్ను లొట్టపోయింది, కాంగ్రెస్ అధికారంలోకి రాగా.. కుట్రలతో ఆ ప్రభుత్వాన్ని పడగొట్టి తిరిగి బీజేపీ అధికారం చేపట్టింది. కర్నాటకలో ఇలాంటి కుటిల వ్యూహాలు తర్వాత రివర్స్ అయ్యాయి. మరి మధ్యప్రదేశ్ లో ఎలాంటి ఫలితాలు వస్తాయో చూడాలి.

First Published:  28 Sep 2023 7:15 AM GMT
Next Story