Telugu Global
National

ఎల్టీటీటీఈ అగ్రనేత ప్రభాకరన్ బతికే ఉన్నారా? -సంచలన ప్రకటన చేసిన నెడుమారన్

తంజావూరు లోని ముల్లివైక్కల్ మెమోరియల్‌లో నెడుమారన్ ఈ రోజు మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ, అంతర్జాతీయ పరిస్థితులు, శ్రీలంకలో రాజపక్షే పాలనను ధ్వంసం చేసిన సింహళీయుల తిరుగుబాటు తదితర పరిస్థితులు... ప్రభాకరన్ అజ్ఞాతం నుంచి బయటకు రావడానికి ఇదే సరైన తరుణమని భావిస్తున్నామన్నారు. ఆయన త్వరలో బయటకు వచ్చి ఈలం తమిళులకు మెరుగైన జీవితం కోసం ఒక ప్రణాళికను ప్రకటిస్తారని నెడుమారన్ చెప్పారు.

ఎల్టీటీటీఈ అగ్రనేత ప్రభాకరన్ బతికే ఉన్నారా? -సంచలన ప్రకటన చేసిన నెడుమారన్
X

లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ ఈలం ఛీఫ్ వేళు పిళ్ళై ప్రభాకర్ న్ బతికే ఉన్నాడా ? శ్రీలంక సైన్యం దాడిలో ఆయన ఆయన చనిపోయాడన్నది నిజం కాదా ? అవును, ప్రభాకరన్ బతికే ఉన్నాడంటున్నారు ప్రపంచ తమిళ సమాఖ్య అధ్యక్షుడు పీ నెడుమారన్ . త్వరలోనే ప్రభాకరన్ బైటికి వస్తారని కూడా ఆయన సోమవారం ప్రకటించారు.

తమిళనాడు, తంజావూరు లోని ముల్లివైక్కల్ మెమోరియల్‌లో నెడుమారన్ ఈ రోజు మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ, అంతర్జాతీయ పరిస్థితులు, శ్రీలంకలో రాజపక్షే పాలనను ధ్వంసం చేసిన సింహళీయుల తిరుగుబాటు తదితర పరిస్థితులు... ప్రభాకరన్ అజ్ఞాతం నుంచి బయటకు రావడానికి ఇదే సరైన తరుణమని భావిస్తున్నామన్నారు. ఆయన త్వరలో బయటకు వచ్చి ఈలం తమిళులకు మెరుగైన జీవితం కోసం ఒక ప్రణాళికను ప్రకటిస్తారని నెడుమారన్ చెప్పారు.

ప్రభాకరన్ మరణంపై అనేక ఊహాగానాలు, సందేహాలు వ్యాపించిన నేపథ్యంలో తన ప్రకటన వాటన్నింటికీ తెరదించుతుందని భావిస్తున్నానని తెలిపారు. ప్రభాకరన్‌కు పూర్తి మద్దతు ఇవ్వడంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమిళులు ఐక్యంగా ఉండాలని నెడుమారన్ పిలుపునిచ్చారు. ప్రభాకరన్‌కు అండగా నిలవాలని తమిళనాడు ప్రభుత్వం, పార్టీలు, తమిళనాడు ప్రజలకు ఆయన పిలుపునిచ్చారు.

ఒక ప్రశ్నకు సమాధానంగా, నెడుమారన్ ప్రభాకరన్ తన కుటుంబ సభ్యులతో టచ్‌లో ఉన్నారని, క్రమం తప్పకుండా ఆయన యోగక్షేమాలు తెలియజేస్తున్న‌ట్లు నెడుమారన్ చెప్పారు. ప్రభాకరన్ సమ్మతితోనే ఆయన బయటకు వస్తారనే విషయాన్ని తాను ప్రకటిస్తున్నట్లు కూడా అతను పేర్కొన్నాడు.

ప్రభాకరన్ ఆచూకీ గురించిన మరో ప్రశ్నకు, ప్రభాకరన్ ఆచూకీ, అతను బయటకు వచ్చే సమయం గురించి ఇతరులలాగే తాను కూడా ఆసక్తిగా ఎదురు చూసున్నానని నెడుమారన్ అన్నారు. ఈ మీడియా సమావేశంలో ప్రముఖ తమిళ కవి కాశీ ఆనందన్ కూడా హాజరయ్యారు.

First Published:  13 Feb 2023 8:39 AM GMT
Next Story