Telugu Global
National

ఆ రాష్ట్రంలో లవర్స్ కి కష్టకాలం..

పాటీదార్లలో కూడా చాలామంది అమ్మాయిలు ఇంట్లో చెప్పకుండా వెళ్లిపోయి పెళ్లి చేసుకుంటున్నారు. చట్టపరంగా ఈ పెళ్లిళ్లను అడ్డుకోవడం వారికి సాధ్యం కావడంలేదు. అందుకే వారు ఈ ప్రతిపాదనను సీఎం ముందు ఉంచారు.

ఆ రాష్ట్రంలో లవర్స్ కి కష్టకాలం..
X

ఆ రాష్ట్రంలో లవర్స్ కి కష్టకాలం..

ప్రేమ పెళ్లిల్లలో పెద్దల అంగీకారం అనేది నామ మాత్రమే. పెద్దలు ఒప్పుకున్నా, ఒప్పుకోకపోయినా స్వతంత్రంగా వెళ్లి పెళ్లి చేసుకుని ఆ తర్వాత రక్షణ కావాలంటూ పోలీస్ స్టేషన్లకు వెళ్లే జంటలు కోకొల్లలు. పోలీసులు కూడా వారు మేజర్లా కాదా అనేది చూస్తారే కానీ, వారి తల్లితండ్రులకు ఆ పెళ్లి ఇష్టమా కాదా అనేది పట్టించుకోరు. చట్టప్రకారం తల్లిదండ్రుల అభిప్రాయం ఇక్కడ అవసరం లేదు. కానీ ఇకపై గుజరాత్ లో ప్రేమ పెళ్లిళ్లకు కూడా పెద్దల అనుమతి తప్పనిసరి కాబోతోంది. ఈమేరకు సీఎం భూపేంద్ర పటేల్ సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్నారు. అవసరమైతే దీనికోసం ఓ చట్టం తెచ్చేందుకు కూడా ఆయన సిద్ధమంటున్నారు.

గుజరాత్ లో పాటీదార్ వర్గం ప్రేమ పెళ్లిళ్లకు పూర్తిగా వ్యతిరేకం. అయితే పాటీదార్లలో కూడా చాలామంది అమ్మాయిలు ఇంట్లో చెప్పకుండా వెళ్లిపోయి పెళ్లి చేసుకుంటున్నారు. చట్టపరంగా ఈ పెళ్లిళ్లను అడ్డుకోవడం వారికి సాధ్యం కావడంలేదు. అందుకే వారు ఈ ప్రతిపాదనను సీఎం ముందు ఉంచారు. ఇంకేముంది, పాటీదార్ల సంతృప్తికోసం సీఎం భూపేంద్ర పటేల్ కూడా రాజ్యాంగబద్ధంగా దీనిపై నిర్ణయం తీసుకుంటామన్నారు. దీంతో గుజరాత్ లో ప్రేమికులకు పెద్ద చిక్కొచ్చిపడింది.

గతంలో ప్రేమ వివాహాల సందర్భంగా జరిగే మతమార్పిడులను గుజరాత్ ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకించింది. అలాంటి మతమార్పిడులు చెల్లవంటూ చట్టం తీసుకొచ్చింది. అలా మతమార్పిడులకు పాల్పడినవారికి పదేళ్లు జైలుశిక్ష విధించేలా చట్టం రూపొందించింది. దీనిపై హైకోర్టు స్టే విధించగా, ప్రస్తుతం సుప్రీంకోర్టులో ఆ కేసు పెండింగ్ లో ఉంది. ఇప్పుడు ప్రేమ వివాహాలకు పెద్దల అనుమతి తప్పనిసరి చేస్తూ గుజరాత్ ప్రభుత్వం చట్టం తీసుకొస్తే అది మరింత సంచలనంగా మారడం ఖాయం.

First Published:  1 Aug 2023 3:53 AM GMT
Next Story