Telugu Global
National

కొట్టేసిన బైక్ తో లవ్ టూర్.. అడ్డంగా దొరికిపోయిన లవర్స్

విచిత్రం ఏంటంటే.. ఈ ఘటనతో ఆ అమ్మాయికి జ్ఞానోదయం అయింది. వాడు చీటర్ అని తెలిసి బ్రేకప్ చెప్పింది.

కొట్టేసిన బైక్ తో లవ్ టూర్.. అడ్డంగా దొరికిపోయిన లవర్స్
X

బైక్ పై వెళ్లే సమయంలో లవర్స్ ఇటీవల రకరకాల విన్యాసాలు చేస్తూ సోషల్ మీడియాలో బుక్కైపోతున్నారు. మొహాలు కనపడకుండా కవర్ చేసుకున్నా చివరకు ఓ జంట మాత్రం పోలీసులకు చిక్కింది.


విచిత్రం ఏంటంటే.. ఈ ఘటనతో ఆ అమ్మాయికి జ్ఞానోదయం అయింది. వాడు చీటర్ అని తెలిసి బ్రేకప్ చెప్పింది. వైరల్ వీడియోలో ఉన్న బైక్ కి అసలు నెంబర్ ప్లేట్ లేదు, డాక్యుమెంట్లు అసలే లేవు. లక్షన్నర రూపాయల విలువ చేసే ఆ బైక్ ని చవకగా 9వేలకు కొన్నాడు ఆ యువకుడు. బైక్ పై ముందు లవర్ ని ఎక్కించుకుని రైడ్ కి వెళ్లాడు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. బైక్ సీజ్ చేశారు.

ఈ ఘటన చత్తీస్ ఘడ్ లో జరిగింది. ఇటీవల బైక్ పై అసహజ రీతిలో ప్రయాణిస్తున్న లవర్స్ వీడియో వైరల్ అయింది. వారిద్దరినీ దగ్గర్నుంచి వీడియో తీసిన ఓ వ్యక్తి దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అయితే ఆ వీడియోలో తమ మొహాలు కనపడకుండా లవర్స్ జాగ్రత్త పడ్డారు. సోషల్ మీడియాలో వీడియో వైరల్ అయినా, తమ ఫేస్ లు కనపడలేదని సంబరపడ్డారు లవర్స్. కట్ చేస్తే పోలీసులు వచ్చి నేరుగా అరెస్ట్ చేసే సరికి వారు షాకయ్యారు.


బైక్ పోయింది.. లవ్ బ్రేకప్ అయింది..

సహజంగా ఇలాంటి విషయాలపై పోలీసులు పెద్దగా దృష్టిపెట్టే అవకాశం లేదు. కానీ ఆ వీడియోలో వారు వెళ్తున్న బైక్ కి నెంబర్ ప్లేట్ లేదు. దీంతో పోలీసులు ఆ బైక్ కోసం వెదుకులాట మొదలు పెట్టారు. నెంబర్ ప్లేట్ లేకపోవడానికి కూడా ఓ కారణం ఉంది.


దొంగతనం చేసిన ఆ బైక్ ని సదరు యువకుడు డాక్యుమెంట్లు లేకుండా 9వేల రూపాయలకు చీప్ గా కొనేశాడు. లవర్ ముందు లక్షన్నర బైక్ అంటూ బిల్డప్ ఇచ్చాడు. అంతేకాదు, పెట్రోల్ ట్యాంక్ పై ఆమెను రివర్స్ లో కూర్చోబెట్టుకుని రైడ్ కి వెళ్లాడు. మనోడి బిల్డప్ చూసి లవర్ తెగ మురిసిపోయింది. తీరా పోలీసులు వచ్చి కొట్టేసిన బైక్ ని కొన్నాడంటూ ట్విస్ట్ ఇచ్చే సరికి ఆమె లవర్ ని అసహ్యించుకుంది, బ్రేకప్ చెప్పేసింది. అమ్మాయి కోసం సాహసం చేసిన ఆ యువకుడు చివరకు పోలీసులకు చిక్కాడు, లవర్ వదిలేయడంతో బిక్కమొహం వేశాడు.

First Published:  23 Jan 2023 6:49 AM GMT
Next Story