Telugu Global
National

VHP కి స్టాండ‌ప్ క‌మెడియ‌న్ కునాల్ క‌మ్రా స‌వాల్!

గురుగ్రామ్ లో జరగాల్సి ఉన్న స్టాండప్ కమెడియన్ కునాల్ కమ్రా షో విశ్వహిందూ పరిషత్ హెచ్చరికలతో ఆగిపోయిన నేపథ్యంలో కమ్రా వీహెచ్ పీ కి బహిరంగ లేఖ రాశారు.నేను జై శ్రీ సీతా రామ్ , జై రాధా కృష్ణ అని బిగ్గరగా, గర్వంతో జపిస్తాను. మీరు నిజంగా భారతదేశపు పిల్లలైతే, 'గాడ్సే ముర్దాబాద్' అని రాసి సందేశాలు పంపండి. అలా చేయకపోతే, మీరు హిందూ వ్యతిరేకులుగా, ఉగ్రవాదానికి మద్దతుదారులుగా పరిగణించాల్సి ఉంటుంది. అని ఆయన తన లేఖలో పేర్కొన్నారు.

VHP కి స్టాండ‌ప్ క‌మెడియ‌న్ కునాల్ క‌మ్రా స‌వాల్!
X

మహాత్మా గాంధీని హత్య చేసిన నాథూరామ్ గాడ్సేచ‌ర్య‌ను ఖండించాలని స్టాండ్-అప్ కమెడియన్ కునాల్ కమ్రా విహెచ్ పి కి సవాలు విసిరారు. విశ్వహిందూ పరిషత్ (విహెచ్ పి) బెదిరింపుల కారణంగా గురుగ్రామ్ లో తన ప్రదర్శనను రద్దు చేసిన త‌ర్వాత ఆయన విహెచ్ పి కి బహిరంగ లేఖ రాశారు,

ఆయన గతంలో అనేక సమస్యలపై బిజెపి నేతృత్వంలోని ఎన్‌డిఎ ప్రభుత్వాన్ని విమర్శించారు. భయపెట్టడం,బెదిరింపులు ద్వారా తాను జీవనోపాధి పొందడం లేదని, విహెచ్‌పి కంటే తానే "పెద్ద హిందువు" అని ప్రకటించుకున్నాడు.

"నేను జై శ్రీ సీతా రామ్ , జై రాధా కృష్ణ అని బిగ్గరగా, గర్వంతో జపిస్తాను. మీరు నిజంగా భారతదేశపు పిల్లలైతే, 'గాడ్సే ముర్దాబాద్' అని రాసి సందేశాలు పంపండి. అలా చేయకపోతే, మీరు హిందూ వ్యతిరేకులుగా, ఉగ్రవాదానికి మద్దతుదారులుగా పరిగణించాల్సి ఉంటుంది. మీరు గాడ్సేను దేవుడిగా భావిస్తున్నారని నాకు చెప్పలేదా? అది నిజమైతే, భవిష్యత్తులో కూడా నా షోలను రద్దు చేస్తూ ఉండండి. ఈ పరీక్షలో మీకంటే పెద్ద హిందువుగా అవతరించినందుకు నేను సంతోషిస్తాను. నేను మీకంటే పెద్ద హిందువుని కాబట్టి కష్టపడి సంపాదించిన ఆహారాన్నే తింటాను. ఒకరిని బెదిరించడం, భయాన్ని వ్యాప్తి చేయడం ద్వారా జీవించడం పాపంగా నేను భావిస్తున్నాను" అని కమ్రా హిందీలో రాసిన లేఖ‌లో పేర్కొన్నారు. దీనికి విహెచ్ పి అధికారిక ట్విట్టర్ హ్యాండిల్‌ను ట్యాగ్ చేశారు.

అతను సెప్టెంబర్ 17, 18 తేదీలలో గురుగ్రాం లోని సెక్టార్ 29లో స్టూడియో ఎక్స్ఓ బార్‌లో ప్రదర్శన ఇవ్వాల్సి ఉంది. అయితే, త‌మ‌కు బెదిరింపులు వ‌స్తున్నందున ఇబ్బందులు ఎదుర్కోవ‌డం ఇష్టం లేని బార్ నిర్వాహ‌కులు ఈ ఈవెంట్‌ను రద్దు చేశారు.

కమ్రా హిందూ మనోభావాలను దెబ్బతీయ‌డ‌మే అలవాటు గ‌ల‌వాడ‌ని ఆరోపిస్తూ విహెచ్ పి, బజరంగ్ దళ్ సంస్థ‌లు నిర్వాహ‌కుల‌కు మెమోరాండం సమర్పించాయి. క‌మ్రా ప్ర‌ద‌ర్శ‌న జ‌రిగితే తాము నిర‌స‌న‌లు తెలుపుతామ‌ని, అడ్డుకుంటామ‌ని ఆ సంస్థ‌ల నాయ‌కులు హెచ్చ‌రించారు. దీంతో బార్ నిర్వ‌హ‌కులు క‌మ్రా ప్రదర్శనను రద్దు చేశారు.

"నేను ఏదైనా దేవుడిని లేదా దేవతను అగౌరవపరిచిన వీడియో లేదా ఒక క్లిప్‌ను నాకు చూపించండి. నేను ప్రభుత్వ చ‌ర్య‌ల‌ను మాత్ర‌మే విమర్శిస్తున్నాను. మీరు వారి కీలుబొమ్మగా ఉండటం మంచిది కాదు "అని క‌మ్రా త‌న లేఖలో పేర్కొన్నారు.

Next Story