Telugu Global
National

బీజేపీకి ఇలాంటోళ్లే కావాలి.. కేటీఆర్ సెటైరికల్ ట్వీట్

ఆయన వ్యాఖ్యల వీడియోను మంత్రి కేటీఆర్ రీట్వీట్ చేస్తూ తీవ్రంగా మండిపడ్డారు. ఇలాంటోళ్లే బీజేపీకి కావాల్సిందంటూ వ్యంగ్యాస్త్రాలు విసిరారు.

బీజేపీకి ఇలాంటోళ్లే కావాలి.. కేటీఆర్ సెటైరికల్ ట్వీట్
X

రాజకీయాల్లో నీఛమైన భాష, నీఛమైన ఉపమానాలు వాడటంలో బీజేపీ నేతలకు ఎవరూ సాటి రారు. తాజాగా బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు కూడా ఈ కోవలోనివే. సంబంధం లేకపోయినా మహిళలను కించపరిచేలా మాట్లాడుతూ రాక్షసానందం పొందుతుంటారు బీజేపీ నేతలు. ఈ జాడ్యం కర్నాటలో కూడా ఉంది. కర్నాటక బీజేపీ చీఫ్ నళిన్ కుమార్ కటీల్ తాజాగా రాహుల్ గాంధీ గురించిన చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఆయన వ్యాఖ్యలను మంత్రి కేటీఆర్ ట్వీట్ చేస్తూ తీవ్రంగా మండిపడ్డారు. ఇలాంటోళ్లే బీజేపీకి కావాల్సిందంటూ వ్యంగ్యాస్త్రాలు విసిరారు.


నళిన్ కుమార్ ఏమన్నారంటే..?

ఇటీవల ఓ బహిరంగ వేదికపై రాహుల్ గాంధీ గురించి నీఛంగా మాట్లాడారు నళిన్ కుమార్. రాహుల్ గాంధీ ఇప్పటి వరకూ ఎందుకు పెళ్లి చేసుకోలేదో తెలుసా అంటూ సెటైర్లు వేశారు. ఆయనకు పిల్లలు పుట్టరని, ఆ విషయం తెలిసే ఆయన పెళ్లి చేసుకోలేదన్నారు. బహిరంగ వేదికపై ఆయన చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఆయనేమీ సాధారణ పార్టీ కార్యకర్త కాదు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు. అక్కడ అధికారంలో ఉంది కూడా బీజేపీయే. ఆ పదవిలో ఉన్న నళిన్ కుమార్ చేసిన చీప్ కామెంట్స్ ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశమవుతున్నాయి.

మోదీ కూడా అంతేనా..?

రాహుల్ గాంధీ పెళ్లి చేసుకోకపోవడానికి కారణం అదే అయితే, మరి పెళ్లి చేసుకున్నా భార్య వద్ద ఉండని వారి విషయంలో కూడా కారణం అదే అయి ఉంటుందా అంటూ నెటిజన్లు కౌంటర్లు ఇస్తున్నారు. అసలు నళిన్ కుమార్ టార్గెట్ రాహుల్ గాంధీయా, లేక మోదీయా అంటూ కామెంట్లు పెడుతున్నారు. రాహుల్ పెళ్లి చేసుకోలేదు, మోదీ పెళ్లి చేసుకున్నా భార్య దగ్గర లేడు.. ఇద్దరి సమస్యా ఒకటేనా అంటూ ప్రశ్నిస్తున్నారు. నళిని కుమార్ వ్యాఖ్యలు, వాటికి నెటిజన్ల కొంటర్లు వైరల్ గా మారాయి.

First Published:  11 March 2023 12:44 PM GMT
Next Story