Telugu Global
National

మళ్లీ నిపా వైరస్‌ ఎంట్రీ.. కేరళలో డేంజర్‌ బెల్స్‌..

నిపా వైరస్‌ను 1989లో ఫస్ట్ టైం మలేషియాలో గుర్తించారు. పందులు, గబ్బిలాలు, కుక్కలు, మేకలు, పిల్లుల ద్వారా ఇది వ్యాప్తి చెందుతుంది.

మళ్లీ నిపా వైరస్‌ ఎంట్రీ.. కేరళలో డేంజర్‌ బెల్స్‌..
X

కేరళలో మళ్లీ భయం మొదలైంది. కోజికోడ్‌ జిల్లాలో రెండు అసహజ మరణాలు సంభవించడంతో ఆ రాష్ట్ర ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. నిపా వైరస్ కారణంగానే ఈ మరణాలు సంభవించినట్లు అనుమానిస్తున్నారు. ఈ నేపథ్యంలో కేరళ హెల్త్ మినిస్టర్ వీణా జార్జ్‌ సోమవారం రివ్యూ మీటింగ్ నిర్వహించారు. మృతుల బంధువులు సైతం ప్రస్తుతం ఐసీయూలో చికిత్స పొందుతున్నట్లు ప్రకటించారు. అయితే ఈ మరణాలకు కారణం నిపా వైరసేనా..? కాదా..? అని నిర్ధారించేందుకు ఆ రాష్ట్ర ప్రభుత్వం కమిటీ కూడా ఏర్పాటు చేసింది. మంగళవారం మధ్యాహ్నానికి దీనిపై రిపోర్టు అందనుంది. ఈ రెండు మరణాల్లో మొదటిది ఆగస్టు 30న సంభవించిందని అధికారులు తెలిపారు.

2018 మే 19న తొలి నిపా వైరస్‌ కేసు కోజికోడ్ జిల్లాలోనే బయటపడింది. 2018 నుంచి 2021 మధ్య కేరళలో అనేక నిపా కేసులు వెలుగులోకి వచ్చాయి. 2021లోనూ మెదడు వ్యాపు వ్యాధితో చనిపోయిన బాలుడిలోనూ నిపా వైరస్‌ను గుర్తించారు.

ఇక నిపా వైరస్‌ను 1989లో ఫస్ట్ టైం మలేషియాలో గుర్తించారు. పందులు, గబ్బిలాలు, కుక్కలు, మేకలు, పిల్లుల ద్వారా ఇది వ్యాప్తి చెందుతుంది. ముఖ్యంగా గబ్బిలాల్లో ఈ వైరస్ సహజంగానే ఉంటుందని నిపుణులు చెప్తున్నారు. అయితే అవి గబ్బిలాలపై ఎటువంటి ప్రభావం చూపించలేవని చెప్తున్నారు. వైరస్‌ ఉన్న గబ్బిలాల ద్వారానే ప్రత్యక్షంగానో, పరోక్షంగానో మనుషులకు వ్యాపిస్తున్నట్లు గుర్తించారు. దీనికి ప్రత్యేకమైన మందులు, వ్యాక్సిన్‌లు లేకపోవడంతో ఆందోళన వ్యక్తమవుతోంది. కోవిడ్‌తో పోలిస్తే నిపా అత్యంత ప్రమాదకరమంటున్నారు వైద్యులు.

First Published:  12 Sep 2023 5:04 AM GMT
Next Story