Telugu Global
National

ఈడీ కార్యాల‌యానికి చేరుకున్న కవిత... కొద్ది సేపట్లో విచారణ ప్రారంభం

కవిత‌ ఇంటి నుంచి బయలుదేరినప్పుడు ఆమెతో పాటు ఈడీ ఆఫీస్ కు వెళ్ళడానికి వందలాది మంది బీఆరెస్ కార్యకర్తలు ప్రయత్నించారు. అయితే పోలీసులు ఆమె కారుతో పాటు మరో వాహనానికి మాత్రమే అనుమతిచ్చా రు. కేసీఆర్ ఇంటి వద్ద పెద్ద ఎత్తున పోలీసులను మోహరించారు.

ఈడీ కార్యాల‌యానికి చేరుకున్న కవిత... కొద్ది సేపట్లో విచారణ ప్రారంభం
X

ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఈ రోజు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ కల్వకుంట్ల కవితను విచారించనుంది. విచారణకు హాజరయ్యేందుకు ఆమె కొద్దిసేపటిక్రితం ఈడీ కార్యాలయానికి హాజరయ్యారు. ఆమెతోపాటు వచ్చిన కవిత భర్త అనీల్ ను కానీ లాయర్లను కానీ అధికారులు కార్యాలయం లోపలికి అనుమతించలేదు.

కవిత‌ ఇంటి నుంచి బయలుదేరినప్పుడు ఆమెతో పాటు ఈడీ ఆఫీస్ కు వెళ్ళడానికి వందలాది మంది బీఆరెస్ కార్యకర్తలు ప్రయత్నించారు. అయితే పోలీసులు ఆమె కారుతో పాటు మరో వాహనానికి మాత్రమే అనుమతిచ్చా రు. కేసీఆర్ ఇంటి వద్ద పెద్ద ఎత్తున పోలీసులను మోహరించారు. ఢిల్లీలోని ఈడీ ఆఫీసు వద్ద పోలీసులు భారీ భద్రత ఏర్పా టు చేశారు.కార్యాలయం చుట్టుపక్కల కూడా 144 సెక్షన్ విధించారు.

ఈ రోజు ఉదయం నుండే కవిత ఉన్న కేసీఆర్ ఇంటి వదకు పెద్ద ఎత్తున బీఆరెస్ కార్యకర్తలు చేరుకున్నారు. మరో వైపు కవిత ఈడీ కార్యాలయానికి బయలుదేరి వెళ్ళే ముందు మంత్రులు కేటీఆర్, హరీశ్ రావులతో చాలా సేపు భేటీ అయ్యారు.

ఈడీ ఆఫీసు వద్దకు మీడియాను కూడా పోలీసులు అనుమతించలేదు. ప్రధాన రోడ్డు వరకే మీడియాను పరిమితం చేశారు.

ఈ రోజు మనీశ్ సిసోడియా, పిళ్లై, కవితలను కలిపి విచారణ చేయనున్నారని తెలుస్తోంది.

కవిత విచారణ పూర్తయ్యే వరకు కేటీఆర్, హరీశ్ రావులు ఢిల్లీలోనే బసచేయనున్నట్టు తెలుస్తోంది. మరో వైపు కేటీఆర్ న్యాయ నిపుణులతో సం ప్రదిం పులు జరుపుతున్నారు.

.

కాగా, కేసీఆర్ ఇంటి వద్దకు బీఆరెస్, భారత జాగృతి కార్యకర్తలు ఇప్పటికీ వస్తూనే ఉన్నారు. అక్కడ బీజేపీ, ఈడీలకు వ్యతిరేకంగా నినాదాలు మారుమోగుతున్నాయి.

First Published:  11 March 2023 6:01 AM GMT
Next Story