Telugu Global
National

బీజేపీతో తెగతెంపులు,నూతన పార్టీ ఏర్పాటు చేసిన గాలి జనార్ధన్ రెడ్డి

కొద్ది రోజులుగా మఠాల సందర్శన, ఆలయాల్లో ప్రత్యేక పూజలు, వివిధ జిల్లాల్లో పర్యటిస్తూ అభిమానులను కలుస్తున్న జనార్ధన్ రెడ్డి ఆదివారం ఉదయం బెంగళూరులోని పారిజాత నివాసంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. బీజేపీ నుంచి తనకు సరైన గుర్తింపు రాని నేపథ్యంలో తాను ఆ పార్టీతో తెగతెంపులు చేసుకుంటున్నట్టు ప్రకటించారు.

బీజేపీతో తెగతెంపులు,నూతన పార్టీ ఏర్పాటు చేసిన గాలి జనార్ధన్ రెడ్డి
X

కర్నాటక రాష్ట్ర రాజకీయాల్లో గత నెల రోజులుగా మాజీ మంత్రి గాలి జనార్ధన రెడ్డి సందడి చేస్తున్నారు. తనకు సరైన పదవి ఇవ్వలేదని బీజేపీ పై ఆగ్రహంగా ఉన్న ఆయన కొద్ది రోజుల క్రితం రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. దాంతో జనార్ధన్ రెడ్డిని బుజ్జగించే పనిని ఆయన సమ్మిహితుడు, రవాణా శాఖ మంత్రి బి. శ్రీరాములుకు బీజేపీ హైకమాండ్ అప్పగించింది. ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా పట్టు వదలని జనార్ధన్ రెడ్డి తానే స్వంతంగా ఒక పార్టీ పెట్టబోతున్నారంటూ కొద్ది రోజులుగా ప్రచారం సాగుతోంది. ఆ విషయంపై ఇప్పటి వరకు నోరు మెదపని గాలి జనార్ధన రెడ్డి ఈ రోజు మీడియా సమావేశం ఏర్పాటు చేసి నూతన పార్టీ ఏర్పాటును ప్రకటించారు.

కొద్ది రోజులుగా మఠాల సందర్శన, ఆలయాల్లో ప్రత్యేక పూజలు, వివిధ జిల్లాల్లో పర్యటిస్తూ అభిమానులను కలుస్తున్న జనార్ధన్ రెడ్డి ఆదివారం ఉదయం బెంగళూరులోని పారిజాత నివాసంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. బీజేపీ నుంచి తనకు సరైన గుర్తింపు రాని నేపథ్యంలో తాను ఆ పార్టీతో తెగతెంపులు చేసుకుంటున్నట్టు ప్రకటించారు. నూతనంగా తాను ఏర్పాటు చేస్తున్న పార్టీ పేరును 'కల్యాణ రాజ్య ప్రగతి పార్టీ' గా ప్రకటించారు.

ముందుగా ఆయన మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయిని స్మరించుకుంటూ విలేకరుల సమావేశాన్ని ప్రారంభించారు. అనంతరం బసవన్న పద్యాలను పఠించారు. రానున్న రోజుల్లో రాష్ట్రంలోని ప్రతి ఇంటికి వెళ్తానని చెప్పారు.

First Published:  25 Dec 2022 8:50 AM GMT
Next Story