Telugu Global
National

లాడ్జ్ లో ప్రియురాలితో హత్యకేసు నిందితుడు... బయట పోలీసుల పహారా

పోలీస్ స్టేషన్లలో రాచమర్యాదలు పొందుతున్న ఖైదీలను గురించి అప్పుడప్పుడు వింటుంటాం. కర్ణాటక పోలీసులు మరో అడుగు ముందుకేసి హత్యకేసులో నిందితుడికి... తన ప్రియురాలిని కలిసే అవకాశం కల్పించారు.

లాడ్జ్ లో ప్రియురాలితో హత్యకేసు నిందితుడు... బయట పోలీసుల పహారా
X

పోలీస్ స్టేషన్లలో రాచమర్యాదలు పొందుతున్న ఖైదీలను గురించి అప్పుడప్పుడు వింటుంటాం. కర్ణాటక పోలీసులు మరో అడుగు ముందుకేసి హత్యకేసులో నిందితుడికి... తన ప్రియురాలిని కలిసే అవకాశం కల్పించారు. కర్ణాటకలోని ధార్వాడ్ లో ఈ సంఘటన చోటు చేసుకుంది. కోర్టులో విచారణ నిమిత్తం నిందితుడిని బయటకు తీసుకువచ్చిన పోలీసులు ఓ లాడ్జ్ లో అతను తన ప్రియురాలిని కలుసుకునే అవకాశం కల్పించారు. ఈ విషయం బయటకు రావటంతో అతనికి సహకరించిన పోలీసు సిబ్బంది పైన పోలీసులు కేసు నమోదు చేశారు.

హత్యకేసులో నిందితుడైన బచ్చాఖాన్ అనే వ్యక్తిని బళ్లారి పోలీసులు ధార్వాడ్ కోర్టుకి విచారణ నిమిత్తం తీసుకుని వచ్చారు. అయితే కోర్టులో విచారణ ముగిసిన తరువాత తిరిగి స్టేషన్ కి తీసుకుని వెళ్లకుండా అతనికి లాడ్జ్ లో తన గర్ల్ ఫ్రెండ్ ని కలుసుకునే అవకాశం కల్పించారు. నిందితుడు గది లోపల ఉండగా పోలీసులు బయట కాపాలా కాశారని తెలుస్తోంది.

నిందితుడు బచ్చాఖాన్ గర్ల్ ఫ్రెండ్ ఆ గదిని తీసుకుంది. ఆమె బెంగళూరుకి చెందిన అమ్మాయి. కాగా విద్యాగిరి పోలీసులు లాడ్జ్ పై రైడ్ చేయగా వారిద్దరు పట్టుపడ్డారు. పోలీసులు బచ్చాఖాన్ ని అదుపులోకి తీసుకుని అతనికి సహకరించిన పోలీసులపై కేసు నమోదు చేశారు. బచ్చాఖాన్ ఫ్రూట్ ఇర్ఫాఖాన్ అనే వ్యక్తి హత్యకేసులో నిందితుడు. ఆస్తి గొడవల కారణంగా ఆగస్టు 2020లో ఇర్ఫాఖాన్ హత్యకు గురయ్యాడు.

First Published:  22 Aug 2022 6:13 AM GMT
Next Story