Telugu Global
National

క‌ర్ణాట‌క‌లో దుమారం రేపుతున్న‌స్వాతంత్య్ర‌ దినోత్సవ ప్రకటన

కర్నాటక ప్రభుత్వం పత్రికలకు ఇచ్చిన ఒక ప్రకటన ఇప్పుడు వివాదాన్ని రాజేసింది. దేశ స్వాతంత్య్ర సమరయోధులకు నివాళులర్పిస్తూ ఇచ్చిన ఈ ప్రకటన‌లో సావర్కర్ తో సహా అనేక మంది ఫోటోలను ఉంచిన ప్రభుత్వం జ‌వ‌హ‌ర్ లాల్ నెహ్రూ ఫోటోను విస్మ‌రించ‌డం దుమారానికి కారణమయ్యింది.

క‌ర్ణాట‌క‌లో దుమారం రేపుతున్న‌స్వాతంత్య్ర‌ దినోత్సవ ప్రకటన
X

దేశ స్వాతంత్య్ర సమరయోధులకు నివాళులర్పిస్తూ క‌ర్నాట‌క లోని బిజెపి ప్ర‌భుత్వం ప‌త్రిక‌ల‌కు ఇచ్చిన ప్ర‌క‌ట‌నపై వివాదం చెల‌రేగుతున్న‌ది. ఈ ప్ర‌క‌ట‌న‌లో విప్ల‌వ సావ‌ర్క‌ర్ అంటూ కీర్తిస్తూ దేశ తొలి ప్ర‌ధాని జ‌వ‌హ‌ర్ లాల్ నెహ్రూ పేరును విస్మ‌రించ‌డం దుమారానికి, వివాదానికి కార‌ణ‌మ‌వుతోంది. ఈ ప్ర‌క‌ట‌న‌పై కాంగ్రెస్ పార్టీ శ్రేణులు తీవ్ర విమ‌ర్శ‌లు చేస్తూ బిజెపి వైఖ‌రిని త‌ప్పుబ‌డుతున్నారు. నెహ్రూ పేరు చేర్చనప్పటికీ, కర్ణాటక ప్రభుత్వం ఇచ్చిన‌ ప్రకటనలో మహాత్మా గాంధీ, మౌలానా ఆజాద్, సుభాష్ చంద్రబోస్ వంటివారి పేర్లు ఉన్నాయి. అందులో సావర్కర్ పేరును చేర్చి 'విప్లవ సావర్కర్' అని పేర్కొన్నారు.

"వినాయక్ దామోదర్ సావర్కర్ విప్లవాత్మక మార్గాల ద్వారా సంపూర్ణ స్వాతంత్య్రం పొందాలని ఆకాంక్షిస్తూ అనేక పుస్తకాలను ప్రచురించారు. ఆయ‌నను అండమాన్ నికోబార్‌లో బంధించిన‌ప్పుడు తీవ్ర మైన చిత్ర‌హింసల‌కు గురి చేశారు. ''అని ప్రకటనలో పేర్కొన్నారు.

'' క‌ర్ణాట‌క ముఖ్య‌మంత్రి తన ఉద్యోగాన్ని కాపాడుకోవాలని తహతహలాడుతున్నారు. ఆయ‌న చేసిన పని తన తండ్రి ఎస్‌ఆర్ బొమ్మై , ఆయ‌నకు తొలి రాజకీయ గురువు ఎంఎన్ రాయ్, నెహ్రూ నుంచి స్ఫూర్తి పొందిన‌వార‌ని తెలుసు అయినా ఇటువంటి ప్ర‌క‌ట‌న ఇవ్వ‌డం ద్వారా ముఖ్య‌మంత్రి వారిని అవమానించారు.. ఇది విచారకరం'' అని కాంగ్రెస్ నేత జైరాం రమేష్‌ ట్వీట్‌ చేశారు.

కాగా, "ఆ ప్రకటన‌లో మహాత్మా గాంధీ, రాణి లక్ష్మీ బాయి ,ఇతర నాయకులతో పాటు నెహ్రూ ఫోటో కూడా ఉంది. ప్రజలకు అబ‌ద్దం చెబుతూ ప్రతిపక్షాలు దాన్ని ఊదరగొట్టే ప్రయత్నం చేస్తున్నాయి'' అని బీజేపీ నేత మోహన్ కృష్ణ ప్రభుత్వ వైఖరిని స్పష్టం చేశారు.

ఎంద‌రో మ‌హ‌నీయుల త్యాగాల ఫ‌లితంతో బార‌త్ దేశం స్వాతంత్య్రం స‌ముపార్జించుకుంది. స్వాతంత్య్ర‌దినోత్స‌వ అమృతోత్స‌వాల వేళ వారంద‌ర‌ని స్మరించుకుంటూ నివాళులు అర్పించాలి. వారి నిస్వార్థ దేశభక్తిని అనుస‌రిస్తానని ప్రతిజ్ఞ చేయాలి. " అని ప్రకటనలో పేర్కొన్నారు.

75వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని సోష‌ల్ మీడియా వినియోగ‌దారులంతా త‌మ డిపి ల‌ను త్రివర్ణ పతాకానికి మార్చుకోవాలని ప్రధాని మోడీ కోరారు. రాహుల్ గాంధీ స‌హా కొంద‌రు కాంగ్రెస్ నాయకులు కూడా సోషల్ మీడియా ఖాతాలలో తమ డిపీల‌ను జాతీయ జెండాను పట్టుకున్న జవహర్‌లాల్ నెహ్రూ చిత్రంగా మార్చారు. అయితే ఇది ఆ పార్టీ 'రాజవంశ సంస్కృతిని ప్ర‌తిబింబివ‌స్తుంద‌ని బిజెపి విమ‌ర్శించిన విష‌యం తెలిసిందే

Next Story