Telugu Global
National

Puneeth Rajkumar: పాఠ్యాంశంగా పునీత్ రాజ్ కుమార్ జీవిత చరిత్ర

పునీత్ రాజ్ కుమార్ చేసిన సేవలు భవిష్యత్తు తరాలవారికి తెలియజేయడంతో పాటు.. అందరూ స్ఫూర్తి పొందేలా ఆయన జీవిత చరిత్రను పాఠ్యాంశాల్లో చేర్చాలని ప్రజల నుంచి ప్రభుత్వానికి వినతులు అందాయి.

Puneeth Rajkumar: పాఠ్యాంశంగా పునీత్ రాజ్ కుమార్ జీవిత చరిత్ర
X

దివంగత కన్నడ అగ్ర హీరో పునీత్ రాజ్ కుమార్ జీవిత చరిత్రను ప్రాథమిక పాఠ్యాంశాల్లో చేర్చాలని కర్ణాటక ప్రభుత్వం నిర్ణయించింది. కన్నడ కంఠీరవ రాజ్ కుమార్ చిన్న కుమారుడు అయిన పునీత్ రాజ్ కుమార్ తండ్రిలాగే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి కన్నడ అగ్ర హీరోగా ఎదిగాడు. నటించింది తక్కువ సినిమాల్లో అయినా అశేష అభిమానులను సంపాదించుకున్నాడు. అంతేకాదు తాను సినిమాల ద్వారా సంపాదించిన డబ్బుతో పేద, అనాథ విద్యార్థులను చదివించాడు. వృద్ధాశ్రమాలను ఏర్పాటు చేశాడు. తన అభిమానులతో నేత్ర, రక్తదానం చేయించాడు.

గత ఏడాది పునీత్ రాజ్ కుమార్ గుండెపోటుతో ఆకస్మికంగా మృతి చెందిన విషయం తెలిసిందే. ఆయన మరణానంతరం పునీత్ చేసిన సేవలకుగాను కర్ణాటక ప్రభుత్వం కర్ణాటక రత్న పురస్కారాన్ని ప్రకటించి గౌరవించింది. కాగా పునీత్ రాజ్ కుమార్ చేసిన సేవలు భవిష్యత్తు తరాలవారికి తెలియజేయడంతో పాటు.. అందరూ స్ఫూర్తి పొందేలా ఆయన జీవిత చరిత్రను పాఠ్యాంశాల్లో చేర్చాలని ప్రజల నుంచి ప్రభుత్వానికి వినతులు అందాయి.

ప్రజల కోరిక మేరకు పునీత్ జీవిత చరిత్రను ప్రాథమిక పాఠ్యాంశాల్లో చేర్చాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై తాజాగా తెలిపారు. ఇప్పటికే కర్ణాటక ప్రభుత్వం పునీత్‌కు రాష్ట్ర అత్యున్నత పురస్కారం అందజేయడంతో పాటు ఆయన జీవిత చరిత్రను పాఠ్యాంశాల్లో చేర్చాలని నిర్ణయం తీసుకోవడంపై పునీత్ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

First Published:  2 Dec 2022 11:21 AM GMT
Next Story