Telugu Global
National

క‌ర్ణాట‌క మాజీ సీఎంపై కేసు న‌మోదు.. తెలంగాణ రాజ‌కీయాల్లో వేలు పెట్టినందుకేనా?

కాంగ్రెస్ ఇచ్చే హామీల గురించి అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ ఓట‌ర్ల‌కు విజ్ఞ‌ప్తి కూడా చేశారు. ఆ మ‌ర్నాడే కుమార‌స్వామి మీద అక్ర‌మ విద్యుత్ వాడ‌కం అంటూ అక్క‌డి కాంగ్రెస్ ప్ర‌భుత్వం కేసు పెట్టింది.

క‌ర్ణాట‌క మాజీ సీఎంపై కేసు న‌మోదు.. తెలంగాణ రాజ‌కీయాల్లో వేలు పెట్టినందుకేనా?
X

క‌ర్ణాట‌క మాజీ ముఖ్యమంత్రి, జేడీఎస్ నేత‌ కుమారస్వామిపై మంగళవారం కేసు నమోదైంది. దీపావళి సందర్భంగా బెంగళూరులోని తన ఇంటికి విద్యుద్దీపాల‌కంర‌ణ‌లో భాగంగా ద‌గ్గ‌ర‌లోని ఓ పోల్ నుంచి అక్రమంగా క‌రెంట్ తీసుకున్నారంటూ మాజీ సీఎంపై బెంగళూరు విద్యుతు సరఫరా సంస్థ(బెస్కాం) అధికారులు మంగ‌ళ‌వారం పోలీసుల‌కు కంప్ల‌యింట్ చేశారు. దీంతో బెంగ‌ళూరులోని జయనగర పోలీసులు కుమారస్వామిపై కేసు నమోదు చేశారు. అయితే దీనికీ తెలంగాణ రాజ‌కీయాల‌కు ఓ ఆస‌క్తిక‌ర‌మైన లింకు క‌నిపిస్తోంది.

టెస్టింగ్ కోస‌మే తీసుకున్నాం.. కావాలంటే ఫైన్ క‌ట్టేస్తా

కుమారస్వామి స్పందిస్తూ తన ఇంటిని అలంకరించే బాధ్యతను ఓ ప్రైవేటు డెక‌రేట‌ర్‌కు అప్ప‌గించాన‌ని, వాళ్లు లైటింగ్ ఎలా ఉందో చూడ‌టానికి టెస్టింగ్ కోస‌మే ఆ పోల్ నుంచి క‌రెంట్ లాగార‌ని చెప్పారు. ఆ టైమ్‌లో తాను ఇంట్లో లేనని, రాగానే చూసి ఇంట్లో మీటర్ నుంచి క‌రెంట్ వాడుకోవాల‌ని సూచించాన‌న్నారు. ఇది అక్రమమని అధికారులు తనకు నోటీసులిచ్చి ఎంక్వ‌యిరీ చేస్తే ఫైన్ క‌ట్టేస్తాన‌ని చెప్పారు. దేశం, రాష్ట్రం మునిగిపోయేంత పని తానేమీ చేయలేదని కౌంట‌ర్ కూడా వేశారు.

తెలంగాణ‌లో కాంగ్రెస్‌ను విమ‌ర్శించినందుకేనా?

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీలు ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. అయితే ఇదే కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలో ఇచ్చిన గ్యారంటీ పథకాలు ఏమీ స‌రిగా అమ‌లు కావ‌డం లేద‌ని కుమార‌స్వామి వ్యాఖ్యానించారు. అంతేకాదు కాంగ్రెస్ ఇచ్చే హామీల గురించి అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ ఓట‌ర్ల‌కు విజ్ఞ‌ప్తి కూడా చేశారు. ఆ మ‌ర్నాడే కుమార‌స్వామి మీద అక్ర‌మ విద్యుత్ వాడ‌కం అంటూ అక్క‌డి కాంగ్రెస్ ప్ర‌భుత్వం కేసు పెట్టింది. దీంతో తెలంగాణ రాజ‌కీయాల్లో వేలు పెట్టినందుకు కుమార‌స్వామి గౌడ‌కు క‌రెంట్ షాక్ కొట్టింద‌ని వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి.

First Published:  15 Nov 2023 6:38 AM GMT
Next Story