Telugu Global
National

కర్ణాటక ఎన్నికల ఫలితాలు.. కాంగ్రెస్ కార్యాలయంలో మొదలైన సంబరాలు

కాంగ్రెస్ స్పష్టమైన ఆధిక్యత దిశగా దూసుకొని పోతుండటంతో ఢిల్లీలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సంబరాలు మొదలయ్యాయి.

కర్ణాటక ఎన్నికల ఫలితాలు.. కాంగ్రెస్ కార్యాలయంలో మొదలైన సంబరాలు
X

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ మొదలైంది. రాష్ట్ర వ్యాప్తంగా అప్పుడే ట్రెండ్స్ బయటకు వస్తున్నాయి. ఎగ్జిట్ పోల్స్ అంచనాలను నిజం చేస్తూ కాంగ్రెస్ పార్టీ దూసుకొని పోతున్నది. కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడిగా మల్లిఖార్జున్ ఖర్గే బాధ్యతలు చేపట్టిన తర్వాత సొంత రాష్ట్రంలో తొలి సారి అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. అక్కడ కాంగ్రెస్ స్పష్టమైన ఆధిక్యత దిశగా దూసుకొని పోతుండటంతో ఢిల్లీలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సంబరాలు మొదలయ్యాయి.

కర్ణాటకలోని 224 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉండగా.. 113 స్థానాలు సాధించిన పార్టీకి అధికారం దక్కుతుంది. ప్రస్తుతం మ్యాజిక్ ఫిగరైన 115కు పైగా నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ ఆధిక్యంలో ఉన్నది. ఓల్డ్ మైసూర్ రీజియన్‌లో 55 సీట్లకు గాను కాంగ్రెస్ 33, బీజేపీ 7, జేడీఎస్ 15 సీట్లలో ఆధిక్యత చూపుతోంది. సెంట్రల్ కర్ణాటకలో 35 సీట్లకు గాను.. బీజేపీ 7, కాంగ్రెస్ 27, జేడీఎస్ ఒక స్థానంలో ఆధిక్యంలో ఉన్నాయి. కోస్టల్ కర్ణాటకలో 21 సీట్లకు గాను బీజేపీ 13, కాంగ్రెస్ 7, జేడీఎస్ ఒక స్థానంలో ఆధిక్యంలో ఉంది.

గ్రేటర్ బెంగళూరులోని 32 స్థానాలకు గాను.. కాంగ్రెస్ 18, బీజేపీ 14 స్థానాల్లో ఆధిక్యత చూపుతున్నాయి. హైదరాబాద్-కర్ణాటకలో 31 సీట్లకుగాను కాంగ్రెస్ 25, బీజేపీ 5, జేడీఎస్ ఒక స్థానంలో ఆధిక్యత చూపిస్తున్నాయి. ముంబై-కర్ణాటకలోని 50 స్థానాలకు గాను బీజేపీ 23, కాంగ్రెస్ 26, జేడీఎస్ ఒక స్థానంలో ఆధిక్యతలో ఉన్నాయి. మొత్తానికి చూస్తే కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన ఆధిక్యత చూపిస్తున్నది.


First Published:  13 May 2023 4:09 AM GMT
Next Story