Telugu Global
National

కాన్పూర్ లో పంజాబ్ తరహా ఘటన.. హాస్టల్ ఉద్యోగి మొబైల్ లో విద్యార్థినుల అసభ్య వీడియోలు

తాము స్నానం చేస్తుండగా హాస్టల్ ఉద్యోగి రహస్యంగా వీడియోలు తీశాడని ఆరోపిస్తూ విద్యార్థినులు నిరసన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసిన వారు పట్టించుకోకపోవడంతో ఆందోళన బాటపట్టారు.

కాన్పూర్ లో పంజాబ్ తరహా ఘటన.. హాస్టల్ ఉద్యోగి మొబైల్ లో విద్యార్థినుల అసభ్య వీడియోలు
X

కొద్దిరోజుల కిందట పంజాబ్ లోని చండీగఢ్ యూనివర్సిటీలో ఒక విద్యార్థిని తన సహ విద్యార్థినులు స్నానం చేస్తుండగా వీడియోలు తీసి వాటిని తన బాయ్ ఫ్రెండ్ కు పంపించిన సంగతి తెలిసిందే. ఈ వీడియోలు కాస్త సోషల్ మీడియాలో అప్లోడ్ కావడంతో ఈ ఘటనపై విద్యార్థినులు యూనివర్సిటీ ఎదుట ఆందోళనలు వ్యక్తం చేశారు. ఈ సంఘటన దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించింది. ఈ ఘటన మరువకముందే ఇదే తరహా సంఘటన ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రం కాన్పూర్ లో జరిగింది.

తాము స్నానం చేస్తుండగా హాస్టల్ ఉద్యోగి రహస్యంగా వీడియోలు తీశాడని ఆరోపిస్తూ విద్యార్థినులు నిరసన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసిన వారు పట్టించుకోకపోవడంతో ఆందోళన బాటపట్టారు. కాన్పూర్ లోని సాయి నివాస్ హాస్టల్ లో పెద్ద సంఖ్యలో విద్యార్థినులు బస చేస్తున్నారు. ఆ హాస్టల్ లో పని చేసే ఒక ఉద్యోగి మొబైల్ ఫోన్లో అసభ్యకర వీడియోలు ఉన్నట్లు బాలికలు చూశారు.

అవి తాము స్నానం చేస్తుండగా రహస్యంగా తీసిన వీడియోలుగా వారు గుర్తించారు. ఈ విషయమై హాస్టల్ విద్యార్థినులు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. వారి నుంచి ఎటువంటి స్పందన రాకపోవడంతో స్టేషన్ ఎదుట నిరసన వ్యక్తం చేశారు. దీంతో దిగివచ్చిన పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి హాస్టల్ ఉద్యోగిని అరెస్టు చేశారు. అతడి వద్ద ఉన్న మొబైల్ ఫోన్ ను స్వాధీనం చేసుకొని ఫోరెనిక్స్ విభాగానికి తరలించినట్లు పోలీసులు తెలిపారు.

First Published:  30 Sep 2022 2:32 AM GMT
Next Story