Telugu Global
National

యూపీ క్రీడాశాఖ నిర్వాకం..టాయిలెట్లలో కబడ్డీ ప్లేయర్ల ఆహారం !

బీజెపీ డబులింజన్ రాష్ట్ర్రం ఉత్తరప్రదేశ్ ఘనకార్యం మరొకటి వెలుగులోకి వచ్చింది. మహిళాకబడ్డీ ప్లేయర్లకు మరుగుదొడ్డిలో ఉంచిన ఆహారం ఇవ్వటం దేశవ్యాప్తంగా కలకలం రేపింది.

యూపీ క్రీడాశాఖ నిర్వాకం..టాయిలెట్లలో కబడ్డీ ప్లేయర్ల ఆహారం !
X

బీజెపీ డబులింజన్ రాష్ట్రం ఉత్తరప్రదేశ్ ఘనకార్యం మరొకటి వెలుగులోకి వచ్చింది. మహిళాకబడ్డీ ప్లేయర్లకు మరుగుదొడ్డిలో ఉంచిన ఆహారం ఇవ్వటం దేశవ్యాప్తంగా కలకలం రేపింది...

ఉత్తరప్రదేశ్..దేశంలోనే అతిపెద్ద రాష్ట్రం. కమలనాధుల డబులింజన్ పాలిత రాష్ట్రం క్రీడాపరంగానూ వివాదలకు చిరునామాగా నిలుస్తోంది. రాష్ట్రనికి చెందిన 200 మంది జూనియర్ కబడ్డీ క్రీడాకారిణులకు..అందచేసే భోజనాన్ని టాయిలెట్లలో ఉంచడం దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది.

సహరాన్ పూర్ లో నిర్వహిస్తున్న యూపీ అండర్ -17 బాలికల కబడ్డీ పోటీలలో పాల్గొనటానికి రాష్ట్రం నలుమూలల నుంచి 200 మంది బాలికలు తరలి వచ్చారు. వీరికి ఆహారం సరఫరా చేసే బాధ్యతను ఓ కాంట్రాక్టర్ కు అప్పజెప్పారు.


అయితే..పరిశుభ్రమైన వాతావరణంలో శుచిగా ఆహారాన్ని అందించాల్సిన కాంట్రాక్టర్ నిర్లక్ష్యం, పై అధికారుల అలసత్వం కారణంగా మరుగుదొడ్లలో ఉంచిన ఆహారాన్ని సరఫరా చేస్తుండడాన్ని మీడియా వెలుగులోకి తెచ్చింది.

సహరాన్ పూర్ లోని డాక్టర్ భీంరావ్ అంబేద్కర్ స్పోర్ట్స్ స్టేడియం కాంప్లెక్స్ లోని మరుగుదొడ్ల కూడలిలో క్రీడాకారులకు అందచేయాల్సిన ఆహారాన్ని ఉంచారు. ప్లేయర్లు సైతం టాయిలెట్లలోకి వెళ్లి మరీ ఆహారాన్ని తెచ్చుకోవాల్సి వచ్చింది. దీనికి సంబంధించిన వీడియో బయటకు రావడంతో...ఫిల్బిత్ ఎంపీ వరుణ్ గాంధీ, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద కేజ్రీవాల్ సోషల్ మీడియా ద్వారా తీవ్రంగా విమర్శించారు.

దేశంలో క్రీడాకారులకు మనం ఇస్తున్న ప్రాధాన్యం, గౌరవం ఇదేనంటూ వరుణ్ గాంధీ మండిపడ్డారు. మరోవైపు..క్రీడాకారులను ఆదరించడం ఇలాగేనా..ఇదేం పద్దతి అంటూ...కేజ్రీవాల్ ప్రశ్నించారు. క్రీడాకారులకు ఇంతకంటే అవమానం మరొకటి ఉండదని వాపోయారు.

కఠినచర్యలు- కేంద్రక్రీడామంత్రి

సహరాన్ పూర్ లో చోటు చేసుకొన్న సంఘటనపై సమగ్రవిచారణకు ఆదేశించామని, నిర్వక్ష్యం వహించిన అధికారులపై కఠిన చర్యలు తీసుకొంటామని కేంద్ర క్రీడాశాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ ప్రకటించారు.

మరోవైపు..సహరాన్ పూర్ క్రీడాధికారి అనిమేశ్ సక్సేనాను సస్పెండ్ చేసి, కాంట్రాక్టర్ ను బ్లాక్ లిస్టులో ఉంచినట్లు యూపీ క్రీడామంత్రిత్వశాఖ ప్రకటించింది.

రాష్ట్ర్రంలోని 17 జిల్లాలకు చెందిన జట్లు పాల్గొన్న ఈ టోర్నీని నిర్వహిస్తున్న విషయం తనకు తెలియదంటూ యూపీ క్రీడాశాఖకు చెందిన ఉన్నత అధికారి డీఎం అఖిలేశ్ సింగ్

ప్రకటించడం మరికొంత గందరగోళం సృష్టించింది.

First Published:  21 Sep 2022 5:56 AM GMT
Next Story