Telugu Global
National

రైల్వే బోర్డు చీఫ్ గా మహిళ..105 ఏళ్లలో చరిత్రలో తొలిసారి

భారత రైల్వే చరిత్రలో అద్భుతమైన నియామకం జరిగింది. సుదీర్ఘ చరిత్ర కలిగిన భారత రైల్వే బోర్డుకు తొలిసారిగా ఓ మహిళ నాయకత్వం వహించనున్నారు.

రైల్వే బోర్డు చీఫ్ గా మహిళ..105 ఏళ్లలో చరిత్రలో తొలిసారి
X

భారత రైల్వే చరిత్రలో అద్భుతమైన నియామకం జరిగింది. సుదీర్ఘ చరిత్ర కలిగిన భారత రైల్వే బోర్డుకు తొలిసారిగా ఓ మహిళ నాయకత్వం వహించనున్నారు. రైల్వే బోర్డు నూతన చైర్ పర్సన్-సీఈవోగా జయా వర్మ సిన్హా నియమితులయ్యారు. ఈ మేర‌కు కేంద్ర ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు జారీ చేసింది. ఇప్పటివరకు రైల్వే బోర్డుకు అనిల్ కుమార్ లహోటీ చైర్మన్ గా వ్యవహరించారు.

ఇండియ‌న్ రైల్వే మేనేజ్‌మెంట్ స‌ర్వీసెస్ అధికారిణి అయిన జ‌య‌వ‌ర్మ‌.. ప్ర‌స్తుతం రైల్వే బోర్డు స‌భ్యురాలిగా (ఆప‌రేష‌న్స్ అండ్ బిజినెస్ డెవ‌ల‌ప్‌మెంట్‌) ఉన్నారు. సెప్టెంబ‌ర్ 1వ తేదీ నుంచి 2024 ఆగ‌స్టు 31వ తేదీ వ‌ర‌కు లేదా త‌దుప‌రి ఆదేశాలు వ‌చ్చే వ‌ర‌కు జ‌య‌వ‌ర్మ సిన్హా రైల్వే బోర్డు సీఈవోగా కొన‌సాగ‌నున్నారు.

అలహాబాద్ యూనివర్సిటీలో చదువుకున జయా వర్మ.. 1988లో ఇండియన్ రైల్వే ట్రాఫిక్ సర్వీస్‌లో చేరారు. ఉత్తర, ఆగ్నేయ, తూర్పు రైల్వే జోన్‌లలో ఆయా హోదాల్లో జయా వర్మ విధులు నిర్వర్తించారు. బంగ్లాదేశ్‌లోని భారత హైకమీషన్‌లో రైల్వే సలహాదారుగా నాలుగేళ్ల పాటు పనిచేశారు. భారతీయ రైల్వేలు ప్రభుత్వం నుండి రికార్డు స్థాయిలో బడ్జెట్ కేటాయింపులు అందుకున్న తరుణంలో ఆమె బోర్డు ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించనున్నారు. రైల్వే బోర్డులో తొలి మహిళా సభ్యురాలిగా ఇప్పటి వరకు విజయలక్ష్మి విశ్వనాథన్‌ ఉన్నారు. అయితే రైల్వే బోర్డుకు తొలి మహిళా చైర్‌పర్సన్‌గా జయ వర్మ సిన్హా బాధ్యతలు చేపట్టారు.

First Published:  31 Aug 2023 2:34 PM GMT
Next Story