Telugu Global
National

ఇస్రో చీఫ్‌ సోమనాథ్‌కు...ఫ్లైట్‌లో స్వీట్‌ వెల్‌కమ్‌..!

ఇండిగో విమానం ఎక్కిన ఇస్రో చీఫ్‌ సోమనాథ్‌కు విమానం సిబ్బంది సర్‌ప్రైజ్‌ చేశారు. ఆయనకు ఘనస్వాగతం పలికారు. ఇస్రో చీఫ్‌కు వెల్‌కమ్‌ చెప్తూ..ఫ్లైట్‌లో స్పెషల్‌ అనౌన్స్‌మెంట్ కూడా చేశారు.

ఇస్రో చీఫ్‌ సోమనాథ్‌కు...ఫ్లైట్‌లో స్వీట్‌ వెల్‌కమ్‌..!
X

చంద్రుని దక్షిణ ధృవంపై చంద్రయాన్‌-3 విక్రమ్‌ ల్యాండర్ సాఫ్ట్ ల్యాండింగ్ కావడంతో ఇండియా హిస్టరీ క్రియేట్ చేసింది. ఈ అరుదైన ఘనతను సొంతం చేసుకున్న ఏకైక దేశంగా ఇండియా నిలిచింది. భారత అంతరిక్ష పరిశోధనా కేంద్రం-ఇస్రో శాస్త్రవేత్తలు అవిరామ కృషి, అంకిత భావానికి చంద్రయాన్‌-3 విజయం నిదర్శనంగా నిలిచింది. ఇక చంద్రయాన్‌-3 సక్సెస్‌ కావడంతో ప్రపంచవ్యాప్తంగా ఇండియాకు ప్రశంసలు వెల్లువెత్తాయి.

ఇక ఇందుకు సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇండిగో విమానం ఎక్కిన ఇస్రో చీఫ్‌ సోమనాథ్‌కు విమానం సిబ్బంది సర్‌ప్రైజ్‌ చేశారు. ఆయనకు ఘనస్వాగతం పలికారు. ఇస్రో చీఫ్‌కు వెల్‌కమ్‌ చెప్తూ..ఫ్లైట్‌లో స్పెషల్‌ అనౌన్స్‌మెంట్ కూడా చేశారు. దేశం గర్వపడేలా చంద్రయాన్‌-3 మిషన్‌ సక్సెస్‌ చేసినందుకు ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు ఇండిగో సిబ్బంది. ఇందుకు సంబంధించిన వీడియోను ఎయిర్ హోస్టెస్‌ పూజా ఇన్‌స్టాలో షేర్‌ చేసింది.

ఈ ప్రకటన వినగానే ఫ్లైట్‌లో ఉన్న ప్రయాణికులందరూ చప్పట్లతో ఇస్రో ఛైర్మన్‌ సోమనాథ్‌ను అభినందించారు. ఆయనను చూసేందుకు సీట్లలో నుంచి లేచారు. మరో ఎయిర్ హోస్టెస్‌ కూల్‌డ్రింక్స్‌, కొన్ని ఫుడ్‌ ఐటమ్స్‌ ఉన్న ట్రేతో వచ్చి ఆయనకు ఇండిగో ఎయిర్‌లైన్స్ తరపున ప్రశంసాపత్రం అందించింది. చిరునవ్వుతో ఆ నోట్‌ను తీసుకున్నారు సోమనాథ్‌. ఇక ఈ వీడియో కింద కామెంట్‌ సెక్షన్‌ మొత్తం అభినందనలతో నిండిపోయింది.


First Published:  31 Aug 2023 11:29 AM GMT
Next Story