Telugu Global
National

ఇంట్రెస్టింగ్ రిపోర్ట్.. తెలుగు రాష్ట్రాల్లోని మగవాళ్లకు లైంగిక భాగస్వాములు ఎక్కువ

దేశవ్యాప్తంగా 707 జిల్లాల్లో 1.1 లక్షల మంది మహిళలు, 1 లక్ష మంది మగవాళ్లు ఈ సర్వేలో పాల్గొన్నారు. 2019 నుంచి 2021 వరకు చేసిన ఈ సర్వేకు సంబంధించిన వివరాలను తాజాగా వెల్లడించారు.

ఇంట్రెస్టింగ్ రిపోర్ట్.. తెలుగు రాష్ట్రాల్లోని మగవాళ్లకు లైంగిక భాగస్వాములు ఎక్కువ
X

తెలుగు రాష్ట్రాల్లోని మగాళ్లు మామూలోళ్లు కాదు. శృంగారం విషయంలో చాలా రసికులే అని.. ఒకరి కంటే ఎక్కువ భాగస్వాములతో లైంగిక సంబంధాలు పెట్టుకుంటున్నట్లు ఓ ఇంట్రెస్టింగ్ రిపోర్ట్ వెలువడింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని మగవాళ్లు ఆడవారి కంటే ఎక్కువ మంది లైంగిక భాగస్వాములను కలిగి ఉన్నట్లు నివేదికలో పేర్కొన్నారు. నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే - 5లో ఈ విషయాలు వెలుగు చూశాయి. దేశవ్యాప్తంగా 707 జిల్లాల్లో 1.1 లక్షల మంది మహిళలు, 1 లక్ష మంది మగవాళ్లు ఈ సర్వేలో పాల్గొన్నారు. 2019 నుంచి 2021 వరకు చేసిన ఈ సర్వేకు సంబంధించిన వివరాలను తాజాగా వెల్లడించారు.

తెలంగాణలో మహిళలు సగటున 1.7 మందితో సెక్స్‌లో పొల్గొంటుండగా.. పురుషులు మాత్రం ముగ్గురితో లైంగిక సంబంధాలు పెట్టుకుంటున్నట్లు తెలుస్తున్నది. ఇక ఏపీలో మహిళలు 1.4 మందితో, పురుషులు 4.7 మందితో శృంగారం జరుపుతున్నారు. దేశవ్యాప్తంగా చూస్తే మేఘాలయ, సిక్కింలో పురుషులు 9.6 మందితో సెక్స్ చేస్తుండగా.. మూడో స్థానంలో ఏపీ (4.7) ఉండటం గమనార్హం. దేశంలో పురుషులు సగటున 7.1 మంది పార్ట్‌నర్స్‌తో సెక్స్ చేస్తున్నారు. గత ఏడాది తెలంగాణలోని 0.4 శాతం మంది మహిళలు ఇద్దరి కంటే ఎక్కువ మందితో సెక్స్ చేసినట్లు ఒప్పుకున్నారు. అదే సమయంలో 2.1 శాతం మంది పురుషులు కూడా పలువురితో లైంగిక చర్యలో పాల్గొన్నట్లు తెలిపారు.

ఇక మరింత ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. దేశంలోని 11 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో పురుషుల కంటే మహిళలకే లైంగిక భాగస్వాములు ఎక్కువగా ఉన్నారు. ఈ రాష్ట్రాల్లో భర్త లేదా సహ జీవనం చేస్తున్న వ్యక్తితో కాకుండా ఇతరులతో మహిళలు ఎక్కువగా సెక్స్‌లో పాల్గొంటున్నట్లు వెల్లడైంది. రాజస్థాన్, హర్యానా, చండీఘర్, జమ్ము అండ్ కశ్మీర్, లద్దాక్, మధ్యప్రదేశ్, అస్సోం, కేరళ, లక్షద్వీప్, పుదుచ్చేరి, తమిళనాడు రాష్ట్రాల్లోని మహిళలకు పురుషుల కంటే ఎక్కువ మంది సెక్స్ భాగస్వాములను కలిగి ఉన్నట్లు నివేదికలో పేర్కొన్నారు.

జాతీయ స్థాయిలో జరిపిన ఈ సర్వేలో 1,061 ఫీల్డ్ బృందాలు పాల్గొన్నాయి. ఒక్కో బృందంలో ఇద్దరు ఆరోగ్య కార్యకర్తలు, ఇద్దరు మహిళ, ఒక పురుష ఇంటర్వ్యూవర్లు ఉన్నారు. ఒక్కో బృందం కనీసం అరగంట సేపు శాంపిల్స్‌తో మాట్లాడినట్లు తెలిపారు. ఎలాంటి సంకోచం లేకుండా తమ సెక్సువల్ లైఫ్ గురించి చర్చించే వాతావరణాన్ని కల్పించి.. ఈ శాంపిల్స్ తీసుకున్నట్లు తెలుస్తున్నది.

First Published:  26 Aug 2022 3:43 AM GMT
Next Story