Telugu Global
National

'ఆందోళన కలిగిస్తున్న ద్రవ్యోల్బణం... ఇప్ప‌టికైనా ఆర్థిక మంత్రి క‌ళ్ళు తెరుస్తారా?'

దేశంలో ద్రవ్యోల్బణం రేటు 7 శాతానికి పెరిగినప్పటికీ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మాత్రం ఈ పరిస్థితిని తేలికగా తీసుకుంటున్నారని మాజీ మంత్రి సీనియ‌ర్ కాంగ్రెస్ నాయ‌కుడు పి.చిదంబరం మండిపడ్డారు. ఆమె ఈ ప‌రిస్థితిని ముప్పుగా ప‌రిగ‌ణించ‌లేక‌పోతే స‌గ‌టు భార‌తీయ కుటుంబానికి ప్ర‌తినిధిగా ఉండ‌జాల‌ర‌ని చిదంబ‌రం ధ్వ‌జ‌మెత్తారు.

ఆందోళన కలిగిస్తున్న ద్రవ్యోల్బణం... ఇప్ప‌టికైనా ఆర్థిక మంత్రి క‌ళ్ళు తెరుస్తారా?
X

దేశంలో ద్ర‌వ్యోల్బ‌ణం పైపైకి దూసుకు పోతుంటే ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామ‌న్ చోద్యం చూస్తుండ‌డం మంచిది కాద‌ని కేంద్ర ఆర్ధిక శాఖ మాజీ మంత్రి సీనియ‌ర్ కాంగ్రెస్ నాయ‌కుడు పి.చిదంబ‌రం హెచ్చ‌రించారు. ఆగస్ట్‌లో ద్రవ్యోల్బణం రేటు 7 శాతానికి పెరగడంపై ఆయ‌న సీతారామ‌న్ పై విమ‌ర్శ‌లు గుప్పించారు. ఆమె ఈ ప‌రిస్థితిని ముప్పుగా ప‌రిగ‌ణించ‌లేక‌పోతే స‌గ‌టు భార‌తీయ కుటుంబానికి ప్ర‌తినిధిగా ఉండ‌జాల‌ర‌ని చిదంబ‌రం ధ్వ‌జ‌మెత్తారు. ఇప్ప‌టికైనా ఆర్ధిక‌మంత్రి క‌ళ్లు తెరిచి వాస్త‌వ ప‌రిస్థితిని గ‌మ‌నించాల‌ని చిదంబ‌రం సూచించారు.

గణాంకాల మంత్రిత్వ శాఖ విడుదల చేసిన లెక్క‌ల ప్రకారం ధరలు జూలైలో 6.71 శాతం నుండి 7 శాతానికి పెరిగాయి. గత మూడు నెలలుగా ద్రవ్యోల్బణం తగ్గుముఖం పట్టడంతో డేటా మునుపటి ట్రెండ్ నుండి డ్రిఫ్ట్‌ను గుర్తించింది.

కొద్ది రోజుల క్రితమే, గౌరవనీయ ఆర్ధిక మంత్రి ద్రవ్యోల్బణం తనకు ముప్పులా క‌నిపించ‌డంలేద‌ని అన్నారు. భారతదేశ రిటైల్ ద్రవ్యోల్బణం నిన్న 7 శాతానికి పెరిగింది. ఆహార ద్రవ్యోల్బణం 7.62 శాతంగా ఉంది" అని చిదంబరం ట్వీట్ చేశారు. ఆమెకి ఇప్పుడు కూడా ప్ర‌మాదం కనిపించకపోతే, ఆమె భారతదేశంలోని సగటు కుటుంబానికి ప్రాతినిధ్యం వహించజాల‌దని మాత్రమే మేము భావించాల్సి ఉంటుంద‌ని చిదంబ‌రం పేర్కొన్నారు.

ఆగ‌స్టులో ఆహార వ‌స్తువుల ద్ర‌వ్యోల్బ‌ణం 7.62 శాతంగా ఉంది. ద్ర‌వ్యోల్బణం అంచనాల‌ను మించిపోవ‌డంతో ఆర్థికవేత్తలలో ఆందోళనలను పెంచింది. ఇప్పుడు ద్ర‌వ్యోల్బణం వరుసగా ఎనిమిది నెలలుగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంచ‌నాలకన్నా 6 శాతం ఎక్కువగా ఉంది.

First Published:  14 Sep 2022 5:57 AM GMT
Next Story