Telugu Global
National

జనవరిలో 3 నెలల గరిష్ట స్థాయి(6.52%)కి చేరుకున్న రిటైల్ ద్రవ్యోల్బణం

ప్రభుత్వ డేటా ప్రకారం, డిసెంబరులో 4.19 శాతంగా ఉన్న ఆహారపు ద్రవ్యోల్బణం జనవరిలో 5.94 శాతంగా ఉంది.అంతకుముందు అక్టోబర్‌లో 6.77 శాతంగా నమోదైంది. రిటైల్ ద్రవ్యోల్బణం 2 శాతం మార్జిన్‌తో 4 శాతం వద్ద ఉండేలా చూడాలని కేంద్ర ప్రభుత్వం రిజర్వ్ బ్యాంక్‌ని ఆదేశించింది.

జనవరిలో 3 నెలల గరిష్ట స్థాయి(6.52%)కి చేరుకున్న రిటైల్ ద్రవ్యోల్బణం
X

దేశ రిటైల్ ద్రవ్యోల్బణం జనవరిలో మూడు నెలల గరిష్ఠ స్థాయి 6.52 శాతానికి పెరిగింది ప్రధానంగా ఆహార వస్తువుల ధరలు , ముడి చమురు ధరల పెరుగుదల తో సహా అనేక ఇతర ఆర్థిక సమస్యలు ద్రవ్యోల్బణం రేటు పెరుగుదలకు దోహదపడ్డాయి.

సోమవారం విడుదల చేసిన ప్రభుత్వ డేటా ప్రకారం, డిసెంబరులో 4.19 శాతంగా ఉన్న ఆహారపు ద్రవ్యోల్బణం జనవరిలో 5.94 శాతంగా ఉంది.అంతకుముందు అక్టోబర్‌లో 6.77 శాతంగా నమోదైంది.

రిటైల్ ద్రవ్యోల్బణం 2 శాతం మార్జిన్‌తో 4 శాతం వద్ద ఉండేలా చూడాలని కేంద్ర ప్రభుత్వం రిజర్వ్ బ్యాంక్‌ని ఆదేశించింది.

1. ఆహార ద్రవ్యోల్బణం పెరుగుదల

ద్రవ్యోల్బణం పెరగడానికి ప్రధాన కారణం ఆహార ద్రవ్యోల్బణం అని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడ్డారు. కన్స్యూమర్ ప్రైజ్ ఇండెక్స్ (CPI )లో ఫుడ్ ఇండెక్స్ డిసెంబర్ 22లో 4.2 శాతం నుండి జనవరి 23 నాటికి 5.9 శాతానికి పెరిగింది. తృణధాన్యాలు , ఉత్పత్తి-ఆధారిత ఆహార ద్రవ్యోల్బణం డిసెంబర్ 2022లో 13.8 శాతం నుండి 2023 జనవరిలో 16.1 శాతానికి చేరుకుంది.

“గోధుమ ధరలను తగ్గించే లక్ష్యంతో 3 మిలియన్ టన్నుల గోదుమలను బహిరంగ మార్కెట్‌లో విక్రయించాలని ప్రభుత్వ నిర్ణయం తీసుకుంది. అయితే, బహిరంగ మార్కెట్‌లో విక్రయించినప్పటికీ మార్కెట్ ధరలు తగ్గ‌లేదు. ఇ-వేలం ద్వారా బల్క్ వినియోగదారులకు రూ.2,350/క్వింటాల్‌కు గోధుమలను విక్రయించాలనే నిర్ణయం బహిరంగ మార్కెట్ గోధుమ ధరపై కొంత ప్రభావం చూపుతుంది” అని ఇండియా రేటింగ్స్ ప్రిన్సిపల్ ఎకనామిస్ట్ డాక్టర్ సునీల్ కుమార్ సిన్హా అన్నారు.

2. ఇన్పుట్ ఖర్చు పెరుగుదల

తృణధాన్యాల కారణంగా ద్రవ్యోల్బణం పెరుగుదల ఉన్నప్పుడు, పశుగ్రాసం ధర పెరగడం వల్ల ఇన్‌పుట్ ఖర్చులు పెరుగుతాయి. గత కొన్ని నెలలుగా, తృణధాన్యాల ద్రవ్యోల్బణం పెరుగుదల క్రమంలో ఉంది, తద్వారా ద్రవ్యోల్బణం పుంజుకుందని HDFC బ్యాంక్ నుండి ఆర్థికవేత్తలు తెలిపారు.

3. చమురు ధరల పెరుగుదల

చమురు ధరలు ఫిబ్రవరి 10న 2 శాతానికి పైగా పెరిగాయి. 8 శాతానికి పైగా లాభాలను నమోదు చేశాయి, పశ్చిమ దేశాలు ముడి చమురు, ఇంధనంపై ధరల పరిమితులను విధించిన తర్వాత వచ్చే నెలలో చమురు ఉత్పత్తిని తగ్గించే ప్రణాళికలను రష్యా ప్రకటించింది. చమురు దిగుమతులపై భారత్ ఆధారపడటం ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడంలో ప్రధాన అడ్డంకిగా మారిందని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడ్డారు. “ఖరీదైన ఆహార పదార్థాలు, చమురు ధరల పెరుగుదల ద్రవ్యోల్బణాన్ని పైపైకి తీసుకెళ్ళింది. చమురు దిగుమతులపై భారతదేశం ఆధారపడటం భారతదేశ ద్రవ్యోల్బణాన్ని ప్రభావితం చేస్తూనే ఉంది, ”అని వెల్త్ మేనేజ్‌మెంట్ కంపెనీ లాడెరప్ MD, ఆర్థికవేత్త, రాఘవేంద్ర నాథ్ అన్నారు.

4. అధిక బంగారం ధర కారణంగా కూడా ద్రవ్యోల్బణం పెరుగుదల కొనసాగుతోంది

ద్రవ్యోల్బణం పెరుగుదలకు 8 ప్రధాన కారణాలలో 4 అంశాలు 6 శాతం కంటే ఎక్కువగా ఉన్నాయి. "అధిక బంగారం ధరలు, పెరుగుతున్న గృహ ద్రవ్యోల్బణం గణనీయమైన నష్టాన్ని కలిగిస్తుంది. " అని బ్యాంక్ ఆఫ్ బరోడా ఆర్థికవేత్త దీపన్విత మజుందార్ తెలిపారు.

First Published:  14 Feb 2023 2:21 AM GMT
Next Story