Telugu Global
National

భారతీయుల్లో వ్యాధి నిరోధక శక్తి పెరిగింది, కొత్త కరోనా వేరియంట్ లు ఏమీ చేయలేవు -CCMB డైరెక్టర్

కొత్త కోవిడ్ వేరియంట్‌లు భారతీయులను ఏమీ చేయలేవని హైదరాబాద్‌కు చెందిన సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (CCMB) డైరెక్టర్ డాక్టర్ వినయ్ కె నందికూరి చెప్పారు.

భారతీయుల్లో వ్యాధి నిరోధక శక్తి పెరిగింది, కొత్త కరోనా వేరియంట్ లు ఏమీ చేయలేవు -CCMB డైరెక్టర్
X

కోవిడ్ ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ లో ఘోరమైన డెల్టా వేరియంట్ తో సహా 250కి పైగా ఓమిక్రాన్ వేరియంట్‌లను ఎదుర్కొన్న తర్వాత, భారతీయులు సహజ వ్యాధి నిరోధశక్తిని సంపాధించారు. వ్యాక్సిన్ లు కూడా దీనికి కొంత కారణమయ్యాయి.

అందువల్ల‌ కొత్త కోవిడ్ వేరియంట్‌లు భారతీయులను ఏమీ చేయలేవని హైదరాబాద్‌కు చెందిన సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (CCMB) డైరెక్టర్ డాక్టర్ వినయ్ కె నందికూరి చెప్పారు.

“మూడు ప్రధాన కోవిడ్ వేవ్ లను ఎదుర్కొన్న‌ త మంచి హైబ్రిడ్ రోగనిదానికి వ్యతిరేకంగా పోరాడుతుంది.. దీని అర్థం మనకు వ్యాధి సోకదని కాదు; మనకు వ్యాధి సోకవచ్చు, కొందరిలో లక్షణాలు కూడా ఎక్కువగా కనిపించవచ్చు. కానీ అవి తీవ్రంగా ఉండవు. అందుకే ప్రజలపై కొత్త వైరస్ లు ప్రభావం చూపించడం లేదు.'’ అని డాక్టర్ నందికూరి తో అన్నారు.

యుఎస్, చైనాలో కొనసాగుతున్న కోవిడ్ వేవ్ లు, ఆ దేశాలలో అంటువ్యాధుల పెరుగుదల జరుగుతున్నంత మాత్రాన ఇండియాలో కూడా అదే పరిస్థితి వస్తుందని అనుకోవడానికి వీలు లేదు. “ఒక నిర్దిష్ట ప్రదేశంలో కోవిడ్ వేరియంట్‌ల తీవ్రత స్థానిక పరిస్థితులుపై ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు, చైనా, యుఎస్ కొత్త అంటువ్యాధుల వేవ్ లను ఎదుర్కొంటున్నాయి, కాని మిగిలిన దేశాల్లో ఆ పరిస్థితి లేదు.”అని అతను చెప్పాడు.

First Published:  12 Jan 2023 6:41 AM GMT
Next Story