Telugu Global
National

బంగారం అయినా, ప్లాటినం అయినా.. తగ్గేదేలేదంటున్న భారతీయులు..

వరల్డ్ ప్లాటినం ఇన్వెస్ట్ మెంట్ కౌన్సిల్ (WPIC) ప్రకారం.. కరోనా తర్వాత అంతర్జాతీయంగా ప్లాటినం వినియోగం తిరిగి పూర్వ స్థితికి చేరుకోవ‌డానికి భారత్ లో ఉన్న డిమాండే కారణం. ఆభరణాలతోపాటు ఆటోమొబైల్ రంగంలో కూడా ప్లాటినం వినియోగం పెరగడంతో ఈ ఖరీదైన లోహానికి తిరిగి మంచి రోజులొచ్చాయి.

బంగారం అయినా, ప్లాటినం అయినా.. తగ్గేదేలేదంటున్న భారతీయులు..
X

"మనల్ని ఎవడ్రా ఆపేది.." ఇటీవల జనసైనికులు విరివిగా ఉపయోగిస్తున్న స్లోగన్ ఇది. బంగారం, ప్లాటినం వినియోగంలో భారతీయులకు ఇది సరిగ్గా సరిపోతుంది. అవును, కరోనా కష్టాలనుంచి కోలుకుంటున్న ఈ దశలో.. బంగారం, ప్లాటినం బిజినెస్ భారత్ లో జోరుగా సాగుతోందని గణాంకాలు చెబుతున్నాయి. ఇప్పటి వరకూ బంగారంపైనే భారతీయులకు ప్రేమ అనుకున్నా.. ఇప్పుడు ప్లాటినం కూడా ఈ లిస్ట్ లో చేరింది. ఖరీదైన వస్తువేదైనా సరే.. వాడకంలో మనల్ని ఎవడ్రా ఆపేది అంటున్నారు ఇండియన్స్.

వరల్డ్ ప్లాటినం ఇన్వెస్ట్ మెంట్ కౌన్సిల్ (WPIC) ప్రకారం.. కరోనా తర్వాత అంతర్జాతీయంగా ప్లాటినం వినియోగం తిరిగి పూర్వ స్థితికి చేరుకోవ‌డానికి భారత్ లో ఉన్న డిమాండే కారణం. ఆభరణాలతోపాటు ఆటోమొబైల్ రంగంలో కూడా ప్లాటినం వినియోగం పెరగడంతో ఈ ఖరీదైన లోహానికి తిరిగి మంచి రోజులొచ్చాయి. కరోనా కష్టకాలంలో బంగారం, వెండి, ప్లాటినం అమ్మకాలు భారీగా పడిపోయాయి. కరోనాకి ముందు 2018లో భారత్ లో ప్లాటినం డిమాండ్ 195 KOZ(వెయ్యి ఔన్స్ లు) గా ఉండేది. 2020లో కరోనా కారణంగా అది 59 KOZ కి పడిపోయింది. 2021లో తిరిగి 123కి చేరింది. 2022 సంవత్సరంలో డిమాండ్ మరింత పెరుగుతోందని అంటున్నారు.

గ్యాసొలిన్ వాహనాలకోసం..

గ్యాసొలిన్ వాహనాల వినియోగంలో కూడా ప్లాటినం వాడతారు. ఆభరణాలకోసం ఎంత మోతాదులో వాడతారో.. గ్యాసొలిన్ వాహనాలకోసం అంతకు రెట్టింపు స్థాయిలో భారత్ లో ప్లాటినం వినియోగిస్తున్నారు. దీంతో ప్రపంచ ప్లాటినం మార్కెట్ లో భారత్ అమెరికాతో పోటీ పడుతోంది. ఆభరణాల విషయంలో మాత్రం అమెరికాను సైతం వెనక్కు నెట్టి భారత్ నెంబర్ 1 స్థానంలో ఉంది. ఆభరణాల విషయంలో భారతీయ కంపెనీలు చేస్తున్న ప్రచారం వల్లే ఈ స్థాయిలో డిమాండ్ ఉన్నట్టు తెలుస్తోంది. బంగారంతోపాటు ప్లాటినం గిరాకీ పెరిగేలా ఇక్కడి కంపెనీలు వ్యూహ రచన చేస్తున్నాయి. బంగారం కొనుగోళ్లకోసం వచ్చే సంప్రదాయ కుటుంబాలను సైతం ప్లాటినం వైపు మొగ్గుచూపేలా చేస్తున్నారు వర్తకులు. దీంతో భారత్ లో కూడా ప్లాటినం మార్కెట్ జోరందుకుంది.

First Published:  7 Sep 2022 6:22 AM GMT
Next Story