Telugu Global
National

చైనా స‌రిహ‌ద్దుల్లో ఉద్రిక్తతల‌ మధ్య అరుణాచల్‌పై భార‌త యుద్ధ విమాన గస్తీ

భార‌త చైనా స‌రిహ‌ద్దుల్లో ఉద్రిక్త‌త‌లు చోటు చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో భార‌త్ లోకి చైనా చొర‌బాట్ల‌ను గ‌మ‌నించేందుకు గ‌గ‌న త‌లంలో భారత వైమానిక దళం ఫైటర్ జెట్‌లతో గ‌స్తీ నిర్వ‌హిస్తోంది.

చైనా స‌రిహ‌ద్దుల్లో ఉద్రిక్తతల‌ మధ్య అరుణాచల్‌పై భార‌త యుద్ధ విమాన గస్తీ
X

భార‌త చైనా స‌రిహ‌ద్దుల్లో ఉద్రిక్త‌త‌ల నేప‌థ్యంలో భార‌త్ ద‌ళాలు అప్ర‌మ‌త్త‌మ‌య్యాయి. అరుణాచ‌ల్ ప్ర‌దే్శ్ పై యుద్ధ విమానాల‌తో గ‌స్తీ నిర్వ‌హిస్తోంది. స‌రిహ‌ద్దుల్లో చైనా సైనిక ద‌ళాలు చుర‌కుగా ముందుకు క‌ద‌ల‌డాన్ని భార‌త వైమానిక ద‌ళాలు గుర్తించాయి.

ఈ నెల మొద‌టి వారంలో త‌వాన్ ప్రాంతంలో చైనా ద‌ళాలు ఘ‌ర్ష‌ణ‌కు దిగాయి. వాస్త‌వాధీన రేఖ‌ను దాటి భార‌త్ లోకి చొచ్చుకురావ‌డంతో ఘ‌ర్ష‌ణ ప్రాంభ‌మైంద‌ని అధికార వ‌ర్గాలు తెలిపాయి. ఈ సంఘ‌ట‌న‌లోఇరువైపులా సైనికులు గాయ‌ప‌డిన విష‌యం తెలిసిందే. దీని త‌ర్వాత స‌రిహ‌ద్దు ప్రాంతంలో ఉద్రిక్త‌త‌లు చోటు చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో భార‌త్ లోకి చైనా చొర‌బాట్ల‌ను గ‌మ‌నించేందుకు గ‌గ‌న త‌లంలో భారత వైమానిక దళం ఫైటర్ జెట్‌లతో గ‌స్తీ నిర్వ‌హిస్తోంది.

ఈ ఘ‌ర్ష‌ణ‌ల అంశంపై పార్లమెంటులో చర్చకు పలు పార్టీలు పట్టుబడుతున్నాయి. దీనిపై లోక్ సభలో వివరణ కోరుతూ ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ సైతం నోటీసు ఇచ్చారు.

ఈ ఘర్షణలపై రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఈ రోజు పార్లమెంట్‌లో ప్రకటన చేయనున్నారు. దీనికంటే ముందు పరిస్థితిని క్షుణ్ణంగా తెలుసుకునేందుకు ఆయన రక్షణ దళాల చీఫ్ (చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్) జనరల్ అనిల్ చౌహాన్, ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ పాండే, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్, ఇతర ముఖ్య అధికారులతో ఉన్న‌త‌స్థాయి స‌మీక్ష నిర్వ‌హించారు.

First Published:  13 Dec 2022 7:51 AM GMT
Next Story