Telugu Global
National

బంగ్లాదేశ్ అధ్యక్షుడి కోసం భారత గుర్రాలు.. ఆసక్తికర విషయం ఏంటంటే..

మన భారతీయ మార్వాడీ గుర్రాలు తొలిసారి బంగ్లాదేశ్‌కు ఎగుమతి అయ్యాయి. ఎడారి ప్రాంతంలో పుట్టిన గుర్రాలు ఇలా ఎగుమతి కావడం ఇదే తొలిసారి.

బంగ్లాదేశ్ అధ్యక్షుడి కోసం భారత గుర్రాలు.. ఆసక్తికర విషయం ఏంటంటే..
X

గతంలో రాజులు అంతా గుర్రాలనే ఎక్కువగా వాడేవారు. ఒకచోటి నుంచి మరో చోటికి వెళ్లాలన్నా.. మరో రాజ్యంపై దండెత్తాలన్నా అశ్విక దళమే ప్రధాన పాత్ర పోషించేది. అందుకే ఈ గుర్రాల కోసం ప్రత్యేకంగా అశ్వశాలలుండేవి. వీటిని చాలా జాగ్రత్తగా చూసుకునేవారు. ఇక ఇప్పటికీ కూడా గుర్రపు పందేలు జరుగుతూనే ఉన్నాయి. అయితే రాజులు పోయినా.. రాజవంశాలు పోయినా గుర్రాలకు మాత్రం లోటు జరగకుండా కొన్ని సంస్థలు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాయి. ఇక భారతీయ మార్వాడికీ తాజాగా చాలా డిమాండ్ వచ్చింది.

మన భారతీయ మార్వాడీ గుర్రాలు తొలిసారి బంగ్లాదేశ్‌కు ఎగుమతి అయ్యాయి. ఎడారి ప్రాంతంలో పుట్టిన గుర్రాలు ఇలా ఎగుమతి కావడం ఇదే తొలిసారి. ఇక బంగ్లాదేశ్‌కు తీసుకెళ్లిన మన మార్వాడీ గుర్రాలను ఏం చేస్తారో తెలుసా? ఏకంగా ఆ దేశ అధ్యక్షుడి గుర్రపు బండిని లాగేందుకు వినియోగిస్తారట. వావ్ అనిపిస్తోంది కదా. బంగ్లాదేశ్‌కు గుర్రాల ఎగుమతిపై ఆల్ ఇండియా మార్వాడీ హార్స్ సొసైటీ అధికారి ఒకరు మాట్లాడుతూ.. రాజస్థాన్‌‌లోని జోధ్‌పూర్ నుంచి బంగ్లాదేశ్‌‌కు ఆరు మార్వాడీ గుర్రాలను ఎగుమతి చేసినట్టు తెలిపారు. తమ ప్రాంతం నుంచి గుర్రాలను ఎగుమతి చేయడం ఇదే తొలిసారి అన్నారు.

గుర్రాల జాతుల విషయానికి వస్తే కొన్ని అత్యుత్తమమైనవి ఉన్నాయి. వాటిలో మార్వాడీ గుర్రాలకు మరింత ప్రత్యేకత ఉంది. ఆసక్తికర విషయం ఏంటంటే.. ఇవి అందంగా ఉంటాయి. అంతేకాకుండా బలంగా ఉంటాయి అలాగే ఎక్కువ కాలం జీవిస్తాయి. ఈ గుర్రాలు జోధ్‌పూర్‌ రాజ్‌పుత్‌ రాజకుటుంబాలకు సంబంధించినవి. గుర్రాలను విదేశాలకు ఎగుమతి చేయడానికి డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ ఫారిన్‌ ట్రేడ్‌ నుంచి లైసెన్సు తీసుకున్నారు. బ్రీడ్ హిస్టరీని మ్యాపింగ్ చేయడం వల్ల మార్వాడీ జాతికి డిమాండ్ పెరిగింది. ఒక దేశ అధ్యక్షుడి జట్కా లాగేందుకు తమ గుర్రాలను దిగుమతి చేసుకుకోవడం గర్వకారణమని మార్వాడీలు చెబుతున్నారు.

First Published:  16 Nov 2022 9:53 AM GMT
Next Story