Telugu Global
National

పాక్ ఉగ్రవాదికి భారత సైనికుల రక్తదానం

వాడు మన ప్రాణాలు తీయడానికి వచ్చాడు, కానీ మనవాళ్లు వాడికి ప్రాణదానం చేశారు.

పాక్ ఉగ్రవాదికి భారత సైనికుల రక్తదానం
X

వాడు మన ప్రాణాలు తీయడానికి వచ్చాడు, కానీ మనవాళ్లు వాడికి ప్రాణదానం చేశారు. సరిహద్దులోని ఆర్మీ పోస్ట్ పై దాడి చేసిన తబరక్ హుస్సేన్ ని ప్రాణాలతో పట్టుకున్నారు భారత జవాన్లు. గాయపడిన అతడికి ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఈ క్రమంలో భారత జవాన్లే అతడికోసం రక్తదానం చశారు. ప్రస్తుతం అతడి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. పాకిస్తాన్ కు చెందిన ఇంటెలిజెన్స్ అధికారి యూనస్ చౌదరి.. భారత్ చెక్ పోస్ట్ పై దాడి చేయాలని తనకు 30వేల రూపాయల పాక్ కరెన్సీ ఇచ్చాడని విచారణలో తబరక్ హుస్సన్ ఒప్పుకున్నాడు.

స్వతంత్ర వజ్రోత్సవాల సందర్భంగా భారత్ లో అలజడులు సృష్టించడానికి పాకిస్తాన్ నుంచి ఇప్పటికే చాలా టీమ్ లు వచ్చాయి. కాల్పుల్లో కొంతమంది జవాన్లు చనిపోగా.. ఉగ్రవాదులందరూ మరణించారు. ప్రాణాలతో పట్టుబడింది ఒక్క తబరక్ హుస్సేన్ మాత్రమే. ఇతని ద్వారా కీలక సమాచారం భారత్ సంపాదించగలిగింది. పాకిస్తాన్ ఆర్మీ నేరుగా ఉగ్రదాడుల్ని ప్రోత్సహిస్తోందని మరోసారి రుజువైంది.

అప్పుడు క్షమించారు, అయినా ఈసారి..

తబరక్‌ హుస్సేన్ గతంలో కూడా సరిహద్దు నియంత్రణ రేఖను దాటినందుకు అరెస్టు అయ్యాడు. అప్పట్లో అతడికి క్షమాభిక్ష పెట్టి తిరిగి పంపించి వేశారు. కానీ తన పద్ధతి మార్చుకోలేదు. ఈసారి ఆత్మాహుతి దాడి చేయడానికి భారత్ లో ప్రవేశిస్తూ పట్టుబడ్డాడు. మరోవైపు లామ్‌ సెక్టార్‌ లో ఇద్దరు చొరబాటుదారులు ల్యాండ్‌ మైన్‌ పేలుడులో మరణించినట్టు భారత సైన్యం వెల్లడించింది. ఉగ్రవాదులు మైన్‌ ఫీల్డ్‌ లోకి ప్రవేశించడంతో.. ల్యాండ్‌ మైన్లు యాక్టివేట్‌ అయి పేలుడు జరిగిందని దీంతో ఇద్దరు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారని తెలిపింది.



First Published:  25 Aug 2022 7:16 AM GMT
Next Story