Telugu Global
National

విమాన ప్రయాణ రేట్లలో ఇండియా విశ్వగురు కాబోతోంది : మాజీ కేంద్ర మంత్రి చిదంబరం

ఇతర స్వేచ్ఛా మార్కెట్ ఆర్థిక వ్యవస్థల మాదిరిగా కాకుండా డిమాండ్ పెరిగినప్పుడు భారతదేశంలో ధరలు పెరుగుతాయని అన్నారు.

విమాన ప్రయాణ రేట్లలో ఇండియా విశ్వగురు కాబోతోంది : మాజీ కేంద్ర మంత్రి చిదంబరం
X

విమాన ప్రయాణ ధరలు విపరీతంగా పెరగటంపై కాంగ్రెస్ నేత, కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి పి. చిదంబరం ప్రభుత్వాన్ని తప్పుపట్టారు. ఆదివారం విస్తారా, ఎయిర్ ఇండియా బిజినెస్ క్లాస్ టిక్కెట్ల ఛార్జీలు విపరీతంగా ఉండటంపై మండిపడ్డారు. ఢిల్లీ-చెన్నై బిజినెస్ క్లాస్ విమాన ప్రయాణ ఛార్జీలు విస్తారాలో రూ.63,000, ఎయిర్ ఇండియాలో రూ.57,000 ఉండటంపై ట్విట్టర్ వేదికగా సెరైర్లు వేశారు.

ఇతర స్వేచ్ఛా మార్కెట్ ఆర్థిక వ్యవస్థల మాదిరిగా కాకుండా డిమాండ్ పెరిగినప్పుడు భారతదేశంలో ధరలు పెరుగుతాయని అన్నారు. విమానయాన సంస్థలు రూట్లను విస్తరిస్తున్నాయని.. పాత రూట్లలో విమాన సర్వీసులను తగ్గించి ధరలు పెంచుతున్నాయని చిదంబరం అన్నారు. ఇదే క్రమంలో చిదంబరం ట్వీట్ పై కొందరు నెటిజన్లు ఎదురుదాడి మెుదలెట్టారు.

విమాన ప్రయాణ ధరలు ఎక్కువగా ఉన్నాయని అనుకున్నప్పుడు ఎకానమీ క్లాస్‌లో ప్రయాణించొచ్చుగా అంటూ మోహన్ రంగనాథన్ అనే నెటిజన్ కామెంట్ చేశాడు. బిజినెస్ క్లాస్ లో ప్రయాణించటాన్ని వద్దనుకుంటే కంపెనీలు సైతం ధరలను తగ్గిస్తాయని సీట్లు ఖాళీగా ఉంచుకోవని అభిప్రాయపడ్డారు. ఇదే సమయంలో స్పందించిన మరో వ్యక్తి దాదాపు సగం రేటుకే అందుబాటులో ఉన్న ఎకానమీ క్లాస్ టిక్కెట్ల ధరలను సైతం చిదంబరం గమనించి ఉంటారంటూ రాశారు. చివరిగా మరో వ్యక్తి మీరేమీ సెలబ్రిటీ కాదు మీకు బిజినెస్ క్లాస్ అవసరమా అని ప్రశ్నిస్తూ.. సాధారణ జీవితాన్ని గడపటానికి ప్రయత్నించాలని సూచించారు.

First Published:  20 Jun 2023 2:17 AM GMT
Next Story