Telugu Global
National

Chhattisgarh:బీజేపీ పాలనలో రూ. 6,500 కోట్ల కుంభకోణం! ఈడీ విచారించాలని సీఎం డిమాండ్

గ‌త బిజెపి ప్రభుత్వ ఆధీనంలోని సివిల్‌ సప్లయ్‌ కార్పొరేషన్‌లో కుంభకోణంతో పాటు , చిట్‌ ఫండ్‌ సంస్థల అక్రమాలు జరిగాయని చత్తీగడ్ ముఖ్య్మంత్రి భూపేష్ బగేల్ ఆరోపించారు.ఈ కుంభ‌కోణాల‌పై విచారణ జరిపించాలని కోరుతూ ముఖ్యమంత్రి ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌కు లేఖ రాశారు.

Chhattisgarh:బీజేపీ పాలనలో రూ. 6,500 కోట్ల కుంభకోణం! ఈడీ విచారించాలని సీఎం డిమాండ్
X

రమణ్‌సింగ్‌ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం హ‌యాంలో కోట్లాది రూపాయ‌ల భారీ కుంభ కోణం జ‌రిగింద‌ని చత్తీస్‌గఢ్‌ ముఖ్యమంత్రి భూపేష్ బాఘెల్ ఆరోపించారు. ఈ కుంభ‌కోణంపై విచార‌ణ జ‌రిపించాల‌ని ఆయ‌న డిమాండ్ చేశారు.

గ‌త బిజెపి ప్రభుత్వ ఆధీనంలోని సివిల్‌ సప్లయ్‌ కార్పొరేషన్‌లో కుంభకోణంతో పాటు , చిట్‌ ఫండ్‌ సంస్థల అక్రమాలు జరిగాయని ఆయ‌న ఆరోపించారు. సుమారు రూ. 6,500 కోట్లు మేర‌కు ఈ మొత్తం కుంభకోణం జ‌రిగింద‌ని ఆయన తెలిపారు.

ఈ కుంభ‌కోణాల‌పై విచారణ జరిపించాలని కోరుతూ ముఖ్యమంత్రి భూపేష్‌ మంగళవారం ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌కు లేఖ రాశారు. ఫెడరల్ యాంటీ మనీ లాండరింగ్ ఏజెన్సీ డైరెక్టర్‌కు తాను రెండు లేఖలను రాశాన‌ని చెప్పిన ఆయన వాటిని ట్వీట్ట‌ర్ లో పోస్ట్ చేశారు. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఈ రెండు "స్కామ్‌ల"పై దర్యాప్తు చేపట్టకపోతే, కోర్టును ఆశ్రయిస్తామని చెప్పారు.

కాంగ్రెస్ ప్రభుత్వం 2016లో అధికారంలోకి వచ్చిన తర్వాత రాజ్‌నంద్‌గావ్, మరియు సుర్గుజాలో కొన్ని ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయని, ఇందులో బీజేపీ మాజీ ఎంపీలు అభిషేక్ సింగ్, మధుసూదన్ యాదవ్, బీజేపీ రాజ్‌నంద్‌గావ్ జిల్లా యూనిట్ చీఫ్ త‌దితరులను నిందితులుగా ఉన్నారని ఆయన చెప్పారు.

ఇప్పటివరకు, త‌మ‌ డబ్బును తిరిగి ఇవ్వాలని కోరుతూ పెట్టుబడిదారుల నుండి 25 లక్షల దరఖాస్తులు అందాయని, ఈ మొత్తం కుంభకోణం సుమారు రూ. 6,500 కోట్లు అని ఆయన చెప్పారు.

"సాధారణంగా 'చిన్న విషయాల్లో' కూడా కేసులు నమోదు చేయడంలో తంద‌ర‌ప‌డే ఎన్‌ఫోర్స్ మెంట్ డైరెక్ట‌రేట్‌(ఈడి) ఈ స్కామ్‌పై విచారణకు ఎటువంటి చొరవ తీసుకోకపోవడం ఆశ్చర్యంగా ఉంది' అని బాఘేల్ వ్యాఖ్యానించారు. ఈడీ ఎలాంటి కేసు నమోదు చేయకుండా రమణ్ సింగ్ కు హామీ ఇచ్చారని ఆయ‌న ఆరోపించారు. 2019లో " సివిల్ స‌ప్లై స్కామ్"కు సంబంధించి ఈడీ కేసు నమోదు చేసిందని, అయితే ఇప్పటివరకు దర్యాప్తు పురోగతికి సంబంధించి ఎటువంటి సమాచారం లేదని ఆయన పేర్కొన్నారు.

ఈడీ 15 రోజులలో ఎటువంటి చర్యలు కానీ దర్యాప్తు కానీ చేప‌ట్ట‌క‌పోతే దీనికి సంబంధించి కోర్టులో పిటిషన్ దాఖలు చేస్తామ‌ని '' అని ఆయన తెలిపారు.


First Published:  9 Nov 2022 6:01 AM GMT
Next Story