Telugu Global
National

మ‌స్తు వ‌ర్షాలు ప‌డ‌తాయ్‌.. మంచిమాట చెప్పిన ఐఎండీ

దేశంలో దీర్ఘ‌కాలిక స‌గ‌టు వ‌ర్ష‌పాతం 87 సెం.మీ. ఈ ఏడాది ఆ స‌గ‌టు దాటి 105 శాతం వ‌ర‌కు వ‌ర్ష‌పాతం న‌మోద‌య్యే అవ‌కాశం ఉంద‌ని ఐఎండీ ప్ర‌క‌టించింది. ప్ర‌స్తుతం మ‌ధ్య ప‌సిఫిక్ మ‌హాస‌ముద్రం మీదుగా ఎల్‌నినో కొన‌సాగుతోంది.

మ‌స్తు వ‌ర్షాలు ప‌డ‌తాయ్‌.. మంచిమాట చెప్పిన ఐఎండీ
X

గ‌త ఏడాది స‌రైన వ‌ర్షాల్లేకపోవ‌డంతో బోర్లు బావురుమంటున్నాయి. బెంగ‌ళూరు లాంటి న‌గ‌రాల్లో నీటి కొర‌త‌తో జ‌నం అల్లాడిపోతున్నారు. హైద‌రాబాద్‌లోనూ బోర్లు నోళ్లు తెరుస్తున్నాయి. ఇలాంటి ప‌రిస్థితుల్లో భార‌త వాతావ‌ర‌ణ సంస్థ (ఐఎండీ) గుడ్‌న్యూస్ చెప్పింది. ఈ ఏడాది స‌గ‌టు వ‌ర్ష‌పాతం కంటే ఎక్కువ వ‌ర్షాలు కురుస్తాయ‌ని ప్ర‌క‌టించింది.

స‌గ‌టు కంటే ఎక్కువ‌

దేశంలో దీర్ఘ‌కాలిక స‌గ‌టు వ‌ర్ష‌పాతం 87 సెం.మీ. ఈ ఏడాది ఆ స‌గ‌టు దాటి 105 శాతం వ‌ర‌కు వ‌ర్ష‌పాతం న‌మోద‌య్యే అవ‌కాశం ఉంద‌ని ఐఎండీ ప్ర‌క‌టించింది. ప్ర‌స్తుతం మ‌ధ్య ప‌సిఫిక్ మ‌హాస‌ముద్రం మీదుగా ఎల్‌నినో కొన‌సాగుతోంది. ఎల్‌నినో ప్ర‌భావంతో ఈ వేస‌విలో ఎండ‌లు దంచి కొడ‌తాయ‌ని.. ఉష్ణోగ్ర‌త‌లు భారీగా పెరుగుతాయ‌ని ఐఎండీనే కాదు ప్ర‌పంచ వాతావ‌ర‌ణ సంస్థ‌ల‌న్నీ హెచ్చ‌రిస్తున్నాయి. అయితే ఎల్‌నినో మెల్ల‌గా తొల‌గిపోతూ రుతుపవ‌నాలు ప్రారంభ‌మ‌య్యేసరికి త‌ట‌స్థ స్థితి ఏర్ప‌డుతుంద‌ని ఐఎండీ వెల్ల‌డించింది.

జూన్ నెలాఖ‌రు నుంచే చ‌ల్ల‌బడుతుందా?

ఎల్‌నినో ప్ర‌భావం ఈ వేస‌వి వ‌ర‌కే ఉంటుంద‌న్న స్కైమేట్ తదిత‌ర వాతావ‌ర‌ణ సంస్థ‌ల అంచ‌నాలు, ఇప్పుడు రుతుప‌వ‌నాలు వ‌చ్చేస‌రికే ఎల్‌నినో తొల‌గిపోతుంద‌న్న ఐఎండీ ప్ర‌క‌ట‌న‌లు ఆశావ‌హ వాతావ‌ర‌ణాన్ని ఏర్ప‌రుస్తున్నాయి. జూన్ నెలాఖ‌రుకే వాతావ‌ర‌ణం చ‌ల్ల‌బ‌డుతుంద‌న్న ఆశ‌లు క‌నిపిస్తున్నాయి.

First Published:  15 April 2024 3:11 PM GMT
Next Story