Telugu Global
National

క‌ర్ణాట‌క‌లో రూ.100 కోట్ల అక్ర‌మ మ‌ద్యం ప‌ట్టివేత‌

చామ‌రాజ‌న‌గ‌ర్ లోక్‌స‌భ నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలోని మైసూర్ జిల్లా తాండ్యా ఇండ‌స్ట్రియ‌ల్ ఏరియాలోని యునైటైడ్ బ్రూవ‌రీస్ ప్లాంట్‌ను ఎక్సైజ్ బృందం ఆక‌స్మికంగా త‌నిఖీ చేసింది.

క‌ర్ణాట‌క‌లో రూ.100 కోట్ల అక్ర‌మ మ‌ద్యం ప‌ట్టివేత‌
X

ఎన్నిక‌ల వేళ అక్ర‌మాల జాత‌ర జ‌రుగుతోంది. ఓట‌ర్ల‌ను ప్ర‌లోభ‌పెట్ట‌డానికి న‌గదే కాదు.. మ‌ద్యం, ఇత‌ర‌త్రా వ‌స్తువుల‌ను భారీ ఎత్తున పోగేస్తున్నాయి పార్టీలు. వాటిని పోలీసుల కంట‌పడ‌కుండా దాచిపెడుతున్నాయి. ఈక్ర‌మంలో క‌ర్ణాక‌ట‌లో ఏకంగా 100 కోట్ల రూపాయ‌ల విలువైన అక్ర‌మ మద్యాన్ని పోలీసులు మంగ‌ళ‌వారం స్వాధీనం చేసుకున్నారు. ఆ వివ‌రాల‌ను ఈ రోజు ప్ర‌క‌టించారు.

చామ‌రాజ‌న‌గ‌ర్ లోక్‌స‌భ నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలోని మైసూర్ జిల్లా తాండ్యా ఇండ‌స్ట్రియ‌ల్ ఏరియాలోని యునైటైడ్ బ్రూవ‌రీస్ ప్లాంట్‌ను ఎక్సైజ్ బృందం ఆక‌స్మికంగా త‌నిఖీ చేసింది. ఈ త‌నిఖీల్లో దాదాపు 98 కోట్ల రూపాయ‌ల‌కుపైగా లెక్క‌ల్లో చూప‌ని లిక్క‌ర్‌ను క‌నిపెట్టారు. మ‌ద్యం బాటిళ్ల‌ను స్వాధీనం చేసుకున్నారు.

ఇప్ప‌టికే 14 వేల కార్ట‌న్ల మ‌ద్యం కేర‌ళకు త‌ర‌లిపోయింద‌ని ఎక్సైజ్ అధికారులు చెబుతున్నారు. ఇప్పుడు ప‌ట్టుకున్న‌ది ఏడు వేల బాక్సుల మ‌ద్య‌మే. అంటే మ‌రో రూ.200 కోట్ల మ‌ద్యం ఇప్ప‌టికే రాష్ట్రం దాటి పొరుగు రాష్ట్రం వెళ్లిపోయింది.

First Published:  4 April 2024 3:10 PM GMT
Next Story