Telugu Global
National

స్టడీస్ లో టాప్.. ఐఐటీ మద్రాస్..

నేషనల్ ఇన్ స్టిట్యూషనల్ ర్యాకింగ్ ఫ్రేమ్‌వర్క్‌(NIRF) విడుదల చేసిన జాబితాలో ఈ ఏడాది కూడా టాప్ ప్లేస్ ని నిలుపుకుంది

స్టడీస్ లో టాప్.. ఐఐటీ మద్రాస్..
X

భారతదేశంలో అత్యుత్తమ విద్యాసంస్థ ఏది..? నాలుగేళ్లుగా ఈ ప్రశ్నకు ఒకటే సమాధానం.. ఐఐటీ మద్రాస్. నాలుగేళ్లుగా ఆ స్థానాన్ని పదిలంగా కాపాడుకోంటోంది ఐఐటీ మద్రాస్. నేషనల్ ఇన్ స్టిట్యూషనల్ ర్యాకింగ్ ఫ్రేమ్‌వర్క్‌(NIRF) విడుదల చేసిన జాబితాలో ఈ ఏడాది కూడా టాప్ ప్లేస్ ని నిలుపుకుంది. కేంద్ర విద్యాశాఖ రూపొందించిన ఈ జాబితాను విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ విడుదల చేశారు.

దేశంలోని అత్యుత్తమ ఉన్నత విద్యా సంస్థల జాబితాలో ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT) మద్రాస్ మొదటి ప్లేస్ లో నిలిచింది. రెండో స్థానంలో IISC బెంగళూరు, మూడో స్థానంలో IIT బాంబే ఉన్నాయి. టాప్ 20లో తెలంగాణకు చెందిన ఐఐటీ హైదరాబాద్, యూనివర్శిటీ ఆఫ్ హైదరాబాద్ చోటు దక్కించుకున్నాయి.

ఉత్తమ విశ్వవిద్యాలయాల విభాగంలో ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (IISC) బెంగళూరు మొదటి స్థానంలో ఉంది. జేఎన్‌యూ రెండో ప్లేస్, జామియామిలియా మూడో ప్లేస్ లో ఉన్నాయి. IIT మద్రాస్, IIT ఢిల్లీ, IIT బాంబే.. ఉత్తమ ఇంజనీరింగ్ కళాశాలల విభాగంలో తొలి మూడు ర్యాంక్ లు దక్కించుకున్నాయి. మెడికల్ విభాగంలో ఢిల్లీలోని ఎయిమ్స్ తొలి స్థానంలో, చండీగఢ్‌లోని పీజీ ఇన్ స్టిట్యూట్ రెండో స్థానంలో, తమిళనాడు వెల్లూరులోని క్రిస్టియన్ మెడికల్ కాలేజ్ మూడో స్థానంలో ఉన్నాయి.

ఫార్మసీ, లా విభాగాల్లో తెలంగాణకు ర్యాంకులు.. .

ఫార్మసీ విభాగంలో జామియా హమ్దార్డ్ కాలేజీ ఫస్ట్ ప్లేస్ లో ఉండగా, హైదరాబాద్‌లోని నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాసుటికల్‌ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్‌ రెండో స్థానంలో ఉంది. చండీగఢ్‌ లోని పంజాబ్ యూనివర్సిటీ మూడో స్థానంలో నిలిచింది. న్యాయ కళాశాలల్లో బెంగళూరులోని నేషనల్ లా స్కూల్ మొదటి స్థానంలో ఉంది. తెలంగాణలోని నల్సార్ యూనివర్శిటీ నాలుగో స్థానంలో నిలిచింది. ఆంధ్రప్రదేశ్‌కు ఆర్కిటెక్చర్ విభాగంలో ర్యాంకు వచ్చింది. విజయవాడలోని స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్.. దేశంలోనే ఏడో స్థానంలో నిలిచింది.

First Published:  15 July 2022 11:37 AM GMT
Next Story