Telugu Global
National

పోటీ ప‌రీక్ష‌ల్లో ఫ్రాడ్ చేస్తే ప‌దేళ్ల జైలు, కోటి జ‌రిమానా!

ప్ర‌స్తుతం జ‌రుగుతున్న పార్ల‌మెంటు స‌మావేశాల్లో కేంద్ర ప్ర‌భుత్వం ప‌బ్లిక్ ఎగ్జామినేష‌న్స్ (ప్రివెన్ష‌న్ ఆఫ్ అన్‌ఫెయిర్ మీన్స్‌) బిల్లును ప్ర‌వేశ‌పెట్టింది.

పోటీ ప‌రీక్ష‌ల్లో ఫ్రాడ్ చేస్తే ప‌దేళ్ల జైలు, కోటి జ‌రిమానా!
X

పోటీ ప‌రీక్ష‌లు.. ఉన్న‌త విద్య‌లో ప్ర‌వేశాల‌కు, ఉద్యోగాల సాధ‌న‌కు ముఖ ద్వారాలు. ఇలాంటి పోటీ ప‌రీక్ష‌ల్లోనూ అవ‌క‌త‌వ‌క‌ల‌కు పాల్ప‌డే ఘ‌ట‌న‌లు త‌ర‌చూ జ‌రుగుతూనే ఉన్నాయి. టెక్నాల‌జీ పెరిగాక కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌లో ఫ్రాడ్స్ కూడా కొత్త మార్గాలు వెతుక్కుంటూనే ఉన్నారు. ఈ నేప‌థ్యంలో పోటీ ప‌రీక్ష‌ల్లో ఫ్రాడ్ చేస్తే క‌ఠిన చ‌ర్య‌ల‌కు కేంద్రం స‌న్న‌ద్ధ‌మ‌వుతోంది.

ప‌బ్లిక్ ఎగ్జామినేష‌న్స్ (ప్రివెన్ష‌న్ ఆఫ్ అన్‌ఫెయిర్ మీన్స్‌)బిల్లు

ప్ర‌స్తుతం జ‌రుగుతున్న పార్ల‌మెంటు స‌మావేశాల్లో కేంద్ర ప్ర‌భుత్వం ప‌బ్లిక్ ఎగ్జామినేష‌న్స్ (ప్రివెన్ష‌న్ ఆఫ్ అన్‌ఫెయిర్ మీన్స్‌) బిల్లును ప్ర‌వేశ‌పెట్టింది. కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌లో అవ‌క‌త‌వ‌క‌ల‌కు పాల్ప‌డిన‌వారికి గ‌రిష్ఠంగా ప‌దేళ్ల జైలు శిక్ష‌, కోటి రూపాయ‌ల వ‌ర‌కు జ‌రిమానా విధించేందుకు అవ‌కాశం క‌ల్పిస్తూ ఈ బిల్లును ప్ర‌వేశ‌పెట్టింది. దీన్ని పార్ల‌మెంటు ఆమోదిస్తే కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌లో అవ‌క‌త‌వ‌క‌ల‌కు పుల్‌స్టాప్ పెట్టొచ్చు.

First Published:  5 Feb 2024 9:21 AM GMT
Next Story