Telugu Global
National

మహారాష్ట్రలో బీఆరెస్ ను గెలిపిస్తే రెండేళ్ళలో అద్భుతాలు చేసి చూపిస్తాం -కేసీఆర్

ఇన్నేళ్ళ స్వాతంత్య్రం తర్వాత కూడా దేశంలో ప్రజలకుతాగడానికి నీళ్ళు లేవు, వ్యవసాయానికి నీళ్ళు లేవు, కరెంట్ లేదు అని కేసీఆర్ మండిపడ్డారు. అన్నదాతలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

మహారాష్ట్రలో బీఆరెస్ ను గెలిపిస్తే రెండేళ్ళలో అద్భుతాలు చేసి చూపిస్తాం -కేసీఆర్
X

మహారాష్ట్రలో బీఆరెస్ ను గెలిపిస్తే రెండేళ్ళలో అద్భుతాలు చేసి చూపిస్తామని బీఆరెస్ జాతీయ అధ్యక్షుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. మహారాష్ట్ర, నాందేడ్ లో జరిగిన బీఆరెస్ బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ, 75 ఏళ్ళ స్వాతంత్య్ర భారతంలో చాలా మంది నాయకులయ్యారు, ముఖ్యమంత్రులయ్యారు, ప్రధానులయ్యారు కానీ ప్రజలకు ఏమీ ఒరగలేదని ఆయన అన్నారు.

ఇన్నేళ్ళ స్వాతంత్య్రం తర్వాత కూడా దేశంలో ప్రజలకుతాగడానికి నీళ్ళు లేవు, వ్యవసాయానికి నీళ్ళు లేవు, కరెంట్ లేదు అని కేసీఆర్ మండిపడ్డారు. అన్నదాతలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

దేశంలో కావాల్సినంత వ్యవసాయానుకూల భూమి ఉందని, నీళ్ళున్నాయని, కరెంట్ తయారు చేయడానికి కావాల్సిన వనరులున్నాయని కేసీఆర్ చెప్పారు.

''75 ఏళ్ళు ఎదురు చూశాం ఇక చాలు. రైతులు భూమి దున్నడమే కాదు కలం పట్టుకొని చట్టాలు చేయాలి. మన దేశం అమెరికాకన్నా ధనవంతమైన దేశం. నీళ్ళు, భూమి, బొగ్గు, మానవ వనరులున్నాయి. చైనాకన్నా, అమెరికా కన్నా ఎక్కువ వ్యవసాయ భూమి ఉంది. '' అని కేసీఆర్ అన్నారు.

ప్రజలు కులం పేరుతో, మతం పేరుతో, పార్టీల పేరుతో చీలి పోకుండా ఐక్యంగా ఈ సారి రైతు ప్రభుత్వం తీసుకరావాలన్నారు కేసీఆర్.

మేకిన్ ఇండియా జోకిన్ ఇండియాగా మారిందని, ప్రతి ఒక్కటీ చైనా నుంచి దిగుమతి చేసుకుంటున్నామని ఎద్దేవా చేశారు కేసీఆర్. ఈ దేశ దుస్థితికి కాంగ్రెస్, బీజేపీలో కారణమని కేసీఆర్ అన్నారు.

మహారాష్ట్రలో బీఆరెస్ ను గెలిపిస్తే తెలంగాణలో ఉన్న పథకాలన్నీ ఇక్కడా అమలు చేస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు.

గులాబీ రాజ్యం తెస్తే మహారాష్ట్రలో 2 ఏళ్ళల్లో అద్భుతాలు చేసి చూపిస్తాం 24 గంటలు ఉచిత విద్యుత్తు ఇస్తాం, రైతు బంధు, రైతు బీమా...ఇలాంటి అనేక కార్య్క్రమాలు అమలు చేస్తాం అని కేసీఆర్ స్పష్టం చేశారు.

First Published:  5 Feb 2023 11:06 AM GMT
Next Story