Telugu Global
National

ఆ వీడియోల్లో నేనూ ఉన్నానా? గుండెలు పిండేసే లేఖ!

ప‍ంజాబ్ లోని చండీగడ్ యూనివర్సిటీ లేడీస్ హాస్టల్ లో స్నానాలు చేస్తున్న విద్యార్థినుల వీడియోలను రహస్యంగా తీసి తన స్నేహితుడి ద్వారా ఓ యువతి సోషల్ మీడియాలో ప్రచారం చేసిన సంఘటన కలకలం సృష్టించింది. ఈ నేపథ్యంలో ఆ హాస్టల్ లో ఉండే ఓ అమ్మాయి రాసిన లేఖ ఇది.

ఆ వీడియోల్లో నేనూ ఉన్నానా? గుండెలు పిండేసే లేఖ!
X

ప‍ంజాబ్ లోని చండీగడ్ యూనివర్సిటీ లేడీస్ హాస్టల్ లో స్నానాలు చేస్తున్న 60 మంది విద్యార్థినుల వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెట్టిన సంఘటనపై ఆ హాస్టల్ విద్యార్థి రాసిన లేఖ‌...

చండీగఢ్ యూనివర్శిటీలో బాలికల అశ్లీల వీడియోలు లీక్ అయిన‌ షాకింగ్ సంఘటన జరిగిన అదే బాలికల హాస్టల్‌లో ఉంటున్న విద్యార్థినుల‌లో నేను ఒకదాన్ని.

స్నానాలు చేస్తుండగా దాదాపు 50,60 మంది అమ్మాయిల అసభ్యకర వీడియోలు రికార్డయ్యాయని పుకార్లు వచ్చాయి. ఇప్పుడు నేను, నా స్నేహితుల్లో చాలా మంది భయంతో జీవిస్తున్నాము. నేను కూడా ఆ వీడియోల్లో ఉంటే ?

నా తల్లిదండ్రులు కూడా భయపడ్డారు. తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు. ఈ పరిస్థితులకు దూరంగా నా బ్యాగులు సర్దుకుని ఇంటికి బయలుదేరాలని ఆలోచిస్తున్నాను. అయితే కొన్ని రోజులు విశ్వవిద్యాలయం మూసివేయబడిందని మాకు ఇప్పుడే సమాచారం అందింది.

నేను గానీ నాస్నేహితులు కానీ అనుభవిస్తున్న బాధలో ఒక్క శాతం కూడా వివరించడానికి పదాలు చాలవు. మాకు ఇంకా నమ్మశక్యం కాని విషయమేమిటంటే, ఈ దుర్మార్గ చర్య మాలో ఒకరు, మాతో నివసిస్తున్న మరొక విద్యార్థిని చేశారు. ఇక్కడ ఎవరినైనా ఎలా నమ్మడం ?

నేను నలుగురితో కలిసి ఒకే గదిలో నివసిస్తున్నాను. ఆ చిన్న గదిలో బట్టలు మార్చుకోవడం, వాష్‌రూమ్‌ని ఉపయోగించడం నాకు ఇప్పుడు చాలా కష్టంగా మారింది. నేనే కాదు హాస్టల్ విద్యార్థినులంతా ఇప్పుడు ఇలాంటి భావోద్వేగాలనే అనుభవిస్తున్నారు.

సెప్టెంబరు 17, శుక్రవారం సాయంత్రం, హాస్టల్‌లో మొత్తం గందరగోళం ఏర్పడింది. అందరూ భయాందోళనలకు గురై వీడియోల లీక్ సంఘటన గురించి మాట్లాడుకుంటున్నారు. అప్పుడే మాకు తెలిసింది 60 మంది విద్యార్థినులు స్నానం చేస్తున్న దృష్యాలను చిత్రీకరించిన ఒక విద్యార్థినిని పట్టుకున్నారని.

తరువాత, ఆ వీడియోల‌ను రికార్డ్ చేసిన విద్యార్థిని తన తప్పు ఒప్పుకుంటూ చెప్పిన ఒప్పుకోలు వీడియోను మా స్నేహితులు నాకు షేర్ చేశారు. హిమాచల్ ప్రదేశ్‌కు చెందిన ఒక వ్యక్తి చెప్పడం వల్ల ఆమె ఆ వీడియోలు రికార్డ్ చేసిందని కూడా మాకు తెలిసింది.

ఇది నా జీవితంలో నేను విన్న అత్యంత భయంకరమైన విషయాలలో ఒకటి. నా మదిలో మెదిలిన మొదటి ప్రశ్న, నేను స్నానం చేస్తున్నప్పుడు ఆమె నన్ను కూడా రికార్డ్ చేసిందా? ఈ ప్రశ్న నన్ను తొలుస్తూనే ఉంది. గత 48 గంటల్లో మానసికంగా, శారీరకంగా మేము చాలా కుంగిపోయాము.

ఏం చేయాలో మాకు అర్థం కాలేదు. ఘటనకు కారణమైన వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ హాస్టల్‌లో నిరసనకు దిగాము. మా హాస్ట‌ల్ లోనే ఉంటూ అసభ్య వీడియోలు తీసిన యువతిని, హిమాచల్ ప్రదేశ్‌కు చెందిన ఆమె స్నేహితుడిని, మరో వ్యక్తిని ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు.

"ఇతర విద్యార్థినులపై చిత్రీకరించిన అభ్యంతరకర వీడియోల పుకార్లు పూర్తిగా తప్పు, నిరాధారమైనవి" అని విశ్వవిద్యాలయం ఆదివారం ఒక తప్పుడు ప్రకటనను విడుదల చేసింది. ఆ వీడియోలను రికార్డ్ చేసిన అమ్మాయి ఒప్పుకోలు వీడియో మా వద్ద ఉంది. విశ్వవిద్యాలయ వాదన నిరాధారమైనది.

తన పేరును కాపాడుకోవడానికి, చండీగఢ్ విశ్వవిద్యాలయం, నిందితురాలిని పట్టుకుని ఆమె ఒప్పుకోలు వీడియో తీసిన అమ్మాయిలను ప్రభావితం చేయడానికి ఒత్తిడి తెస్తోంది. "అమ్మాయి చిత్రీకరించిన తన వ్యక్తిగత వీడియో ఆమె బాయ్‌ఫ్రెండ్‌తో పంచుకున్నది తప్ప ఇతర విద్యార్థినుల అభ్యంతరకర వీడియో ఏదీ ఆమె దగ్గర లేదు'' అని విశ్వవిద్యాలయం పేర్కొంది. ఇది పూర్తిగా తప్పుడు వాదన. ఎందుకంటే ఒకటి, అమ్మాయే తాను వీడియోలు తీసినట్టు స్వయంగా ఒప్పుకుంది. రెండు, ఈ కేసులో ఆమెతోపాటు మరో ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు.

హాస్టల్‌లో విద్యార్థినుల‌ అశ్లీల వీడియోలను కొనుగోలు చేసి బైట విక్రయిస్తున్న‌ భారీ రాకెట్ గురించి ఇప్పుడు వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలు మమ్ములను తీవ్ర భయాందోళనలకు గురిచేస్తున్నాయి.

గత రాత్రి (ఆదివారం) సుమారు 1:30 గంటలకు (సెప్టెంబర్ 18) మేము మా నిరసనను ముగించాము, ఈ సమస్యపై విచారణ జరిపి న్యాయం చేయడానికి విశ్వవిద్యాలయం అంగీకరించింది. కానీ మరో వైపు విశ్వవిద్యాలయం సమస్యను నీరుగార్చడానికి ప్రయత్నిస్తుండటం మాకు ఆందోళన కలిగిస్తుంది.

- చండీఘడ్ యూనివర్సిటీ హాస్టల్ లో ఉండే ఒక విద్యార్థిని

First Published:  19 Sep 2022 3:06 PM GMT
Next Story