Telugu Global
National

భార్య అబార్షన్ చేయించుకోవడానికి భర్త అనుమతి అక్కర్లేదు: కేరళ హైకోర్టు తీర్పు

భార్య అబార్షన్ చేయించుకోవడానికి భర్త అనుమతి అక్కర్లేదంటూ ఈ రోజు కేరళ హైకోర్టు తీర్పునిచ్చింది. కొట్టాయంకు చెందిన ఓ 21 ఏళ్ళ యువతి కేరళ హైకోర్టును ఆశ్రయించగా, కోర్టు ఈ మేరకు స్పష్టం చేసింది.

భార్య అబార్షన్ చేయించుకోవడానికి భర్త అనుమతి అక్కర్లేదు: కేరళ హైకోర్టు తీర్పు
X

మహిళ గర్భాన్ని తొలగించుకోవాలనుకుంటే భర్త అనుమతి అవసరం లేదని కేరళ హైకోర్టు ఈ రోజు తీర్పునిచ్చింది. తనకు అబార్షన్ చేయించుకోవడానికి అనుమతి ఇవ్వాలంటూ కొట్టాయంకు చెందిన ఓ 21 ఏళ్ళ యువతి కేరళ హైకోర్టును ఆశ్రయించగా, కోర్టు ఈ మేరకు స్పష్టం చేసింది.

కొట్టాయంకు చెందిన ఓ యువతి కొంత కాలం క్రితం ఓ యువకుడిని ప్రేమించి పెళ్ళి చేసుకుంది. ఆమె ఇంట్లోవాళ్ళకు ఇష్టం లేకున్నప్పటికీ ఆమె ఈ పెళ్ళి చేసుకుంది. అయితే పెళ్ళైన కొన్ని రోజులకే భర్త తో సహా అత్తింటి వారు ఆమెను వేధించడం మొదలు పెట్టారు. ఆమె గర్భవతి అని కూడా చూడకుండా ఆమెను అనుమానిస్తూ వేధించాడు భర్త. ఆ వేధింపులు తట్టుకోలేని ఆ యువతి పుట్టింటికి వచ్చేసింది.

ఆ తర్వాత తాను అబార్షన్ చేయించుకోవడానికి ఓ ఆస్పత్రికి వెళ్ళగా భర్త అనుమతి కావాలంటూ వాళ్ళు చెప్పారు. లేదంటే విడిపోయినట్టు రుజువులు కావాలని అడిగారు. దాంతో ఆ యువతి హైకోర్టును ఆశ్రయించింది.

ఈ కేసును కూలంకుశంగా పరిశీలించిన కోర్టు భర్త ప్రవర్తనలో వచ్చిన మార్పును గుర్తించింది. దాని వల్ల ఆమె జీవితం తీవ్రమైన ఒడిదుడుకలకు లోనయ్యిందని కోర్టు భావించింది. ఈ నేపథ్యంలో, ఆమె అబార్షన్ కు భర్త అనుమతి అవసరంలేదని కీలక తీర్పు వెలువరించింది. కొట్టాయం మెడికల్ కాలేజీ, లేదా ఏదైనా ప్రభుత్వ ఆసుపత్రిలో గానీ అబార్షన్ చేయించుకునేందుకు ఆమెకు వెసులుబాటు కల్పించింది.

First Published:  27 Sep 2022 12:25 PM GMT
Next Story