Telugu Global
National

టీసీఎస్‌కు లాభాల పంట‌.. ఆ ఉద్యోగులకు డ‌బుల్ డిజిట్ ఇంక్రిమెంట్లంట‌

లాభాల ప్ర‌క‌ట‌న చేస్తున్న సంద‌ర్భంగా చీఫ్ హెచ్ఆర్ ఆఫీస‌ర్ మిలింద్ ల‌క్క‌డ్ కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. 2023-24 ఆర్థిక సంవ‌త్స‌రంలో మెరుగైన ప‌నితీరు క‌న‌బ‌రిచిన వారికి రెండంకెల (డ‌బుల్ డిజిట్‌) ఇంక్రిమెంట్లు ఇస్తామ‌ని ప్ర‌క‌టించారు.

టీసీఎస్‌కు లాభాల పంట‌.. ఆ ఉద్యోగులకు డ‌బుల్ డిజిట్ ఇంక్రిమెంట్లంట‌
X

దేశంలోనే అతిపెద్ద సాఫ్ట్‌వేర్ సేవ‌ల సంస్థ టాటా క‌న్స‌ల్టెన్సీ స‌ర్వీస్ (టీసీఎస్‌) గ‌డిచిన మూడు నెల‌ల్లో రూ.12,434 కోట్ల లాభాలు ఆర్జించింది. దీంతో 2023-24 ఫైనాన్షియ‌ల్ ఇయ‌ర్‌లో టీసీఎస్ లాభం రూ.45,908 కోట్ల‌కు చేరింది. ఇది అంత‌కు ముందు సంవ‌త్స‌రం కంటే ఎక్కువ‌. లాభాలు పెర‌గ‌డంతో ఉద్యోగుల‌కు ఇంక్రిమెంట్ల‌పైనా గుడ్ న్యూస్ చెప్పింది ఆ సంస్థ‌.

డ‌బుల్ డిజిట్ ఇంక్రిమెంట్లు ఇస్తాం

లాభాల ప్ర‌క‌ట‌న చేస్తున్న సంద‌ర్భంగా చీఫ్ హెచ్ఆర్ ఆఫీస‌ర్ మిలింద్ ల‌క్క‌డ్ కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. 2023-24 ఆర్థిక సంవ‌త్స‌రంలో మెరుగైన ప‌నితీరు క‌న‌బ‌రిచిన వారికి రెండంకెల (డ‌బుల్ డిజిట్‌) ఇంక్రిమెంట్లు ఇస్తామ‌ని ప్ర‌క‌టించారు.

6 ల‌క్ష‌ల‌కు చేరిన ఉద్యోగులు

అయితే మార్చి 31తో ముగిసిన గ‌త ఆర్థిక సంవ‌త్స‌రంలో టీసీఎస్ ఉద్యోగుల సంఖ్య 13,249 త‌గ్గింది. 2022-23లో కొత్త‌గా 22,600 మంది చేరితే ఈసారి అందులో సగం మంది సంస్థ నుంచి బ‌య‌టికి వెళ్లిపోయారు. మొత్తంగా ప్ర‌స్తుతం టీసీఎస్‌లో ఉద్యోగుల సంఖ్య 6.01 ల‌క్ష‌ల‌కు చేరింద‌ని కంపెనీ ప్ర‌క‌టించింది.

First Published:  12 April 2024 1:30 PM GMT
Next Story