Telugu Global
National

సైబర్ మోసగాళ్లు ఫోన్ చేస్తే ఇలా చేయండి..

మోసగాళ్లు రెండోసారి మనకు ఫోన్ చేయకుండా ఉండాలంటే ఇలా చేయండి అంటూ తెలంగాణ ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ ఓ వీడియో షేర్ చేశారు. అదేంటో మీరే చూడండి.

సైబర్ మోసగాళ్లు ఫోన్ చేస్తే ఇలా చేయండి..
X

కేవలం ఒకే ఒక్క ఫోన్ కాల్ తో బ్యాంకులోని డబ్బులంతా స్వాహా చేస్తున్నారు సైబర్ మోసగాళ్లు. చదువుకోనివారు, అమాయకులే కాదు.. ఐఏఎస్ ర్యాంకు అధికారులు సైతం వీరి బుట్టలో పడి డబ్బులు పోగొట్టుకున్న ఉదాహరణలున్నాయి. సాక్షాత్తూ కేంద్ర మాజీ ఐటీ మంత్రి దయానిధి మారన్ కూడా ఇలాంటి ఫోన్ కాల్స్ కి బాధితుడు కావడం విశేషం. అయితే ఇలాంటి సైబర్ స్కామ్ మోసగాళ్లు ఫోన్ చేస్తే మనం ఏం చేయాలి అనేదే ఇప్పుడు అసలు విషయం. మోసగాళ్లు రెండోసారి మనకు ఫోన్ చేయకుండా ఉండాలంటే ఇలా చేయండి అంటూ తెలంగాణ ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ ఓ వీడియో షేర్ చేశారు. అదేంటో మీరే చూడండి.


మోసగాళ్లు ఫోన్ చేస్తే ఆ నెంబర్ ని బ్లాక్ చేయండి అని సహజంగా అందరూ సలహా ఇస్తుంటారు. కానీ మనం ఎన్ని నెంబర్లు బ్లాక్ చేస్తాం, ఎంతమందికి తెలివిగా సమాధానం చెబుతాం. అవన్నీ పక్కనపెట్టి తాను చెప్పిన సలహా పాటించండి అంటూ ఓ ఫన్నీ వీడియో షేర్ చేశారు సజ్జనార్. 'హౌ టు అవాయిడ్ స్కామర్స్ కాల్స్' అనే వీడియోని ట్విట్టర్లో ఉంచారు.

సహజంగా సైబర్ మోసగాళ్లు ఎలాంటి నెంబర్లనుంచి కాల్ చేస్తుంటారనే విషయంపై పోలీస్ శాఖ ఇప్పటికే కొన్ని సూచనలు చేసింది. అలాంటి నెంబర్ల నుంచి కాల్ వస్తే సైలెంట్ గా ఆన్సర్ చేసి, ఫోన్ పై ఓ గిన్నె బోర్లించి గరిటెతో దబదబా బాదిపడేయాలని సలహా ఇస్తున్నారు సజ్జనార్. అలా చేస్తే మళ్లీ ఫోన్ కాల్ వస్తుందంటారా అంటూ క్యాప్షన్ పెట్టి మరీ నెటిజన్లను ఎడ్యుకేట్ చేస్తున్నారు. ఆయన ట్వీట్ ఫన్నీగానే ఉన్నా.. అందులో పరమార్థం చాలా ఉంది. స్కామర్స్ కాల్స్ అటెండ్ చేయనే కూడదు, ఒకవేళ చేసినా.. ఎలాంటి సమాధానం చెప్పకూడదు అని అంటున్నారు సజ్జనార్.

First Published:  11 Oct 2023 11:01 AM GMT
Next Story