Telugu Global
National

చెల్లిని ప్రేమించాడని..ముక్కలు ముక్కలుగా నరికి కుక్కలకు వేసిన అన్న

పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టగా.. బిట్టు ఓ యువతిని ప్రేమించినట్లు తెలుసుకున్నారు. యువతి అన్న రాహుల్ పై అనుమానం రావడంతో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు.

చెల్లిని ప్రేమించాడని..ముక్కలు ముక్కలుగా నరికి కుక్కలకు వేసిన అన్న
X

సమాజం ఎంత అభివృద్ధి చెందుతున్నా జనాల్లో మాత్రం ఇంకా కుల మతాల జాడ్యం వీడటం లేదు. తక్కువ కులానికి చెందిన ఓ యువకుడు తన చెల్లిని ప్రేమించాడని ఆగ్రహించిన అన్న అతడిని ముక్కలు ముక్కలుగా నరికి కుక్కలకు ఆహారంగా వేశాడు. ఈ దారుణ సంఘటన బీహార్ రాష్ట్రంలో జరిగింది. నలందకు చెందిన బిట్టు ఈ నెల 16వ తేదీ ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాలేదు. అతడి కోసం అన్నిచోట్ల వెతికినా ఫలితం లేకపోవడంతో ఈనెల 18వ తేదీన కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టగా.. బిట్టు ఓ యువతిని ప్రేమించినట్లు తెలుసుకున్నారు. యువతి అన్న రాహుల్ పై అనుమానం రావడంతో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. అతడి వద్ద బిట్టు మొబైల్ ఉండడం గుర్తించి దానిని స్వాధీనం చేసుకున్నారు. రాహులే బిట్టుని ఏమైనా చేసి ఉంటాడని భావించిన పోలీసులు తమ స్టైల్లో విచారణ చేపట్టగా.. బిట్టును తానే హత్య చేసినట్లు రాహుల్ ఒప్పుకున్నాడు.

తన చెల్లితో బిట్టు సన్నిహితంగా మెలుగుతుండడంతో తట్టుకోలేకపోయానని చెప్పాడు. అందుకే అతన్ని హత్య చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిపాడు. ఈనెల 16వ తేదీన మాట్లాడుకుందామని బిట్టుని పిలిచి హత్య చేసినట్లు చెప్పాడు. ఆ తర్వాత అతడి శరీరాన్ని ముక్కలు ముక్కలుగా నరికి కుక్కలకు ఆహారంగా వేసినట్లు రాహుల్ తెలిపాడు. అనంతరం మిగిలిన శరీర భాగాలను నదిలో పారేసినట్లు చెప్పాడు. నలంద జిల్లాలో జరిగిన ఈ పరువు హత్య ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది.

First Published:  27 Dec 2022 5:47 AM GMT
Next Story