Telugu Global
National

ఆ ఎమ్మెల్యే నాలుక తెగ్గోస్తే రూ.10 లక్షల రివార్డ్

దేవుళ్లపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బహదూర్ నాలుక తెగ్గోసి తెచ్చిన వారికి రూ.10 లక్షలు బహుమానంగా అందిస్తామని ప్రకటించారు.

ఆ ఎమ్మెల్యే నాలుక తెగ్గోస్తే రూ.10 లక్షల రివార్డ్
X

హిందూ దేవుళ్ళపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఆర్జేడీ ఎమ్మెల్యే ఫతే బహదూర్ సింగ్ నాలుక తెగ్గోసిన వారికి రూ.10 లక్షల రివార్డును అందజేస్తామంటూ బీహార్‌లో పోస్టర్లు వెలిశాయి. శివ భవానీ సేన ఈ పోస్టర్లను అంటించింది.

కొద్ది రోజుల కిందట ఎమ్మెల్యే బహదూర్ సింగ్ పేరిట గోడలపై పోస్టర్లు ప్రత్యక్షమయ్యాయి. ఆ పోస్టర్లలో 'ఆలయం అంటే మానసిక బానిసత్వానికి మార్గం, పాఠశాల అంటే జీవితంలో వెలుగుల మార్గం' అని రాసి ఉంది. అలాగే 'గుడి గంట మోగిస్తే మనం మూఢనమ్మకాలు, మూర్ఖత్వం, అజ్ఞానం వైపు పయనిస్తున్నామని, బడి గంట మోగిస్తే హేతుబద్ధమైన జ్ఞానం, శాస్త్రీయత, వెలుగుల వైపు పయనిస్తున్నట్లు' అని రాసి ఉంది.

అలాగే ఆ పోస్టర్‌లో ఆర్జేడీ వ్యవస్థాపకుడు లాలూ ప్రసాద్, ఆయన సతీమణి, మాజీ ముఖ్యమంత్రి రబ్రీ దేవి ఫొటోలు ఉన్నాయి. కాగా, ఈ పోస్టర్ల పట్ల హిందూ శివ భవానీ సేన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా ఆ సంస్థ అధ్యక్షుడు లవ్ కుమార్ సింగ్ విలేకరులతో మాట్లాడుతూ దేవుళ్లపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బహదూర్ నాలుక తెగ్గోసి తెచ్చిన వారికి రూ.10 లక్షలు బహుమానంగా అందిస్తామని ప్రకటించారు. బహదూర్ సింగ్ ఉద్దేశపూర్వకంగానే హిందువుల మనోభావాలను దెబ్బతీశారని ఆరోపించారు.

First Published:  4 Jan 2024 10:40 AM GMT
Next Story