Telugu Global
National

నెహ్రూ పై త‌ప్పుడు ప్రచారం హిమాల‌యాలు, భూమాత కూడా క్షమించవు... రాజ‌మోహ‌న్ గాంధీ

పండిట్ జవహర్ లాల్ నెహ్రూ పై బీజేపీ చేస్తున్న తప్పుడు ప్రచారాలను మహాత్మా గాంధీ మనవడు రాజ్ మోహన్ గాంధీ ఖండించారు. నెహ్రూ పై రాజ‌కీయ నేత‌లు దుష్ప్రచారాలు చేయ‌డం ప‌ట్ల హిమాల‌యాలు, భూమాత కూడ నిర‌స‌న తెలుపుతాయి అన్నారాయన.

నెహ్రూ పై త‌ప్పుడు ప్రచారం హిమాల‌యాలు, భూమాత కూడా క్షమించవు...  రాజ‌మోహ‌న్ గాంధీ
X

దేశ తొలిప్ర‌ధాని పండిట్ జ‌వ‌హ‌ర్ లాల్ నెహ్రూ గురించి ఇటీవ‌ల కాలంలో బిజెపి నాయ‌కులు స‌హా ప‌లువురు చేస్తున్న వ్యాఖ్య‌ల‌ను , వ‌క్రీక‌ర‌ణ‌ల‌ను ప్ర‌ముఖ ర‌చ‌యిత, చ‌రిత్ర‌కారుడు, మహాత్మా గాంధీ మనవడు రాజ‌మోహ‌న్ గాంధీ ఖండించారు." ఎంతో తెలివైన‌, మంచి, గొప్ప వ్య‌క్తి అయిన నెహ్రూ గురించి త‌ప్పుడు క‌థ‌నాలు, విష‌యాలు ప్ర‌చారం చేస్తున్నార‌ని ఆయ‌న అన్నారు. నెహ్రూ పై రాజ‌కీయ నేత‌లు ఇటువంటి వ్యాఖ్య‌లు చేయ‌డం ప‌ట్ల హిమాల‌యాలు, భూమాత కూడ నిర‌స‌న తెలుపుతాయి" అని గాంధీ అన్నారు.

కసౌలీలోని ఖుష్వంత్ సింగ్ లిట్రరీఫెస్టివల్ లో ఆయ‌న పాల్గొన్నారు. మహాత్మా గాంధీ, జవహర్‌లాల్ నెహ్రూ, దేశ విభజన, సమకాలీన భారతదేశం గురించి తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మోయిత్రా అడిగిన ప్రశ్నకు రాజ్‌మోహన్ గాంధీ స్పందిస్తూ '75 ఏళ్ల వారసత్వానికి ప్రతీక‌లు అని పేర్కొన్నారు.

"ఆయ‌న దాదాపు 14 యేళ్ళు జైలు జీవితం గ‌డిపారు. అది సామాన్య విష‌యం కాదు. ఆయ‌న జైలు నుంచి విడుద‌లైన కొద్ది రోజుల‌కే ఆయ‌న భార్య మ‌ర‌ణించారు. ఆయ‌న ఎంతో గొప్ప వ్య‌క్తి. హ‌మాల‌యాల‌ను అమితంగా ప్రేమించిన వ్య‌క్తి. ఆయ‌న‌పై వ‌స్తున్న విమ‌ర్శ‌లు, త‌ప్పుడు క‌థ‌నాల‌కు వారిని హిమాల‌యాలు, భూమి కూడా క్ష‌మించ‌వు " అని రాజ‌మోహ‌న్ గాంధీ అన్నారు. మీరు ఆయ‌న విధానాలను విమర్శించవచ్చు కానీ పూర్తిగా అసత్య ప్రచారం చేయడానికి మీకు ఏమి హక్కు ఉంది? నేను దీనిని తీవ్రంగా ప‌రిగ‌ణిస్తున్నాన‌ని " చెప్పారు.

''బరాక్ ఒబామా అమెరికాలో పుట్టలేదని చాలా మంది శ్వేతజాతీయులు నమ్ముతున్నారు.. కోట్లాది మంది భారతీయులు మోతీలాల్ నెహ్రూ ముస్లిం అని నమ్మడం మొదలుపెట్టారు. ఈ అబద్దాన్ని ఏళ్ల తరబడి ప్రచారం చేస్తున్నారు. నెహ్రూ ముస్లిం అన‌డం అబ‌ద్దం. ఒక వేళ అయినా అది నేరం కాదు. మీ పూర్వీకుడు ఫలానా అంటూ ఒక వ్య‌క్తిని చంప‌డం కానీ శిక్షించ‌డం కానీ, నిందించడం కానీ చేయ‌లేరు. " అని రాజ‌మోహ‌న్ గాంధీ చెప్పాడు.

త‌న తాత మహాత్మా గాంధీని ప్రస్తావిస్తూ, "గాంధీకి ఇప్పుడు ఏమీ జరగదు, గాంధీ సురక్షితంగా ఉన్నారు. ఎందుకంటే ఆయ‌న మ‌ళ్ళీ బ‌త‌క‌లేర‌నే వాస్త‌వం నాకు తెలుసు కాబట్టి గాంధీ సురక్షితంగానే ఉన్నాడు అని రాజ్‌మోహన్ గాంధీ అన్నారు.

జవహర్‌లాల్ నెహ్రూ, మహాత్మా గాంధీ, సర్దార్ పటేల్ ఏమైనా పొర‌బాట్లు చేసి ఉంటే వాటిపై ప్రశ్నలు, విమ‌ర్శ‌లు లేవనెత్తకూడదని, వారు ఆమోదించిన విలువలను, దేశం కోసం వారు చేసిన త్యాగాలను మాత్ర‌మే గుర్తుంచుకోవాలని రాజ‌మోహ‌న గాంధీ అన్నారు.

First Published:  16 Oct 2022 9:07 AM GMT
Next Story