Telugu Global
National

ఛీఛీ..! రేపిస్ట్ బాబా ముందు మోకరిల్లిన బీజేపీ మంత్రి..

హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో డేరా బాబా శిష్య పరమాణువుల ఓట్లకోసం మంత్రి విక్రమ్ ఠాగూర్ ఈ స్థాయికి దిగజారారు. రేపిస్ట్ బాబా కాళ్లపై పడ్డారు.

ఛీఛీ..! రేపిస్ట్ బాబా ముందు మోకరిల్లిన బీజేపీ మంత్రి..
X

సాధారణ ఎన్నికలైనా, ఉప ఎన్నికలైనా బీజేపీ ఎన్ని నక్కజిత్తులు ప్రయోగిస్తుందో అందరికీ తెలిసిందే. తాజాగా హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల ముందు డేరా బాబాను పెరోల్ పై విడుదల చేసి ఆయన భక్తుల ఓట్లకోసం పాకులాడుతున్నారు బీజేపీ నేతలు. హిమాచల్ ప్రదేశ్ లో కూడా డేరా బాబా భక్తులున్నారు. ఆ ఓట్లు చేజారకూడదంటే, ఆయన ప్రసంగాలతో మరింతమంది మైమరచిపోయి తమకు ఓట్లు వేయాలంటే, ఆయన్ను పెరోల్ పై బయటకు తెస్తే చాలనుకున్నారు. ఇంకేముంది రేప్, మర్డర్ కేసుల్లో దోషిగా తేలి శిక్ష అనుభవిస్తున్న డేరా బాబా పెరోల్ పై బయటకు తెచ్చారు. వరుసగా బీజేపీ మంత్రులు వెళ్లి ఆయన కాళ్లపై పడి ఆశీర్వాదం తీసుకుంటున్నారు.

బిల్కిస్ బానో రేప్ కేసులో దోషుల్ని సత్ప్ర‌వర్తన కారణంగా విడుదల చేసిన గుజరాత్ ప్రభుత్వ సాహసం ఇంకా ప్రజల్ని వెక్కిరిస్తూనే ఉంది. హత్యాచార కేసులో ఏకంగా దోషిగా తేలిన డేరా బాబాకు 40రోజులు పెరోల్ మంజూరు చేసి అంతకంటే పెద్ద సాహసమే చేశారిప్పుడు. హిమాచల్ ప్రదేశ్ మంత్రులు ఇప్పుడు ఆయన దర్శనం కోసం క్యూ కట్టారు. రవాణా శాఖ మంత్రి విక్రమ్‌ ఠాగూర్‌ నేరుగా డేరా బాబాను కలసి ఆశీర్వాదం తీసుకున్నారు. రేప్ అండ్ మర్డర్ కేసులో దోషి ముందు ఓ మంత్రి మోకరిల్లడం, ఆయన ఆశీస్సులు కావాలని అడగడం బీజేపీకే చెల్లిందనే విమర్శలు వినపడుతున్నాయి. హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో డేరా బాబా శిష్య పరమాణువుల ఓట్లకోసం మంత్రి విక్రమ్ ఠాగూర్ ఈ స్థాయికి దిగజారారు. రేపిస్ట్ బాబా కాళ్లపై పడ్డారు.

అత్యాచారం, హత్య కేసుల్లో దోషిగా తేలి జీవిత ఖైదు అనుభవిస్తున్న డేరా సచ్చా సౌదా అధినేత గుర్మీత్‌ రాం రహీం సింగ్‌ అలియాస్ డేరా బాబాకు హర్యానాలోని బీజేపీ ప్రభుత్వం అక్టోబర్‌ 14న పెరోల్ మంజూరు చేసింది. నవంబర్-3న హర్యానాలో ఆదంపూర్ ఉప ఎన్నిక ఉంది, ఆ తర్వాత పంచాయతీ ఎన్నికలున్నాయి, హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు కూడా షెడ్యూల్ వచ్చేసింది. ఈ దశలో రెండు రాష్ట్రాల్లో ఉన్న ఆయన భక్తుల్ని ప్రసన్నం చేసుకోడానికి బీజేపీ అధినాయకత్వం ఈ ఎత్తుగడ వేసింది.

First Published:  29 Oct 2022 1:19 AM GMT
Next Story