Telugu Global
National

హిమాచల్‌ స్పీకర్ షాకింగ్‌ డెసిషన్‌.. ఆరుగురిపై వేటు

ప్రస్తుతం అనర్హత వేటు పడిన ఆరుగురు ఎమ్మెల్యేల్లో రాజిందర్ రాణా, సుధీర్ శర్మ, ఇందర్ దత్‌ లఖన్‌పాల్, దేవిందర్ కుమార్, రవి ఠాకూర్, చేతన్య శర్మ ఉన్నారు.

హిమాచల్‌ స్పీకర్ షాకింగ్‌ డెసిషన్‌.. ఆరుగురిపై వేటు
X

ఇటీవల జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో బీజేపీకి క్రాస్ ఓటింగ్‌కు పాల్ప‌డిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడింది. ఈ మేరకు ఆ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ కుల్దీప్ సింగ్ ప్రకటన విడుదల చేశారు. క్రాస్ ఓటింగ్ కారణంగా కాంగ్రెస్ అభ్యర్థి అభిషేక్ మను సింఘ్వి ఓటమి పాలయ్యారు.

క్రాస్ ఓటింగ్ తర్వాత బుధవారం అసెంబ్లీకి హాజరయ్యారు ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు. అంతకుముందు వారంతా బీజేపీ పాలిత హర్యానాలో ఉన్నారు. క్రాస్ ఓటింగ్ తర్వాత అసెంబ్లీకి హాజరైన ఆరుగురు ఎమ్మెల్యేలపై బీజేపీ ప్రశంసలు కురిపించింది.

ప్రస్తుతం అనర్హత వేటు పడిన ఆరుగురు ఎమ్మెల్యేల్లో రాజిందర్ రాణా, సుధీర్ శర్మ, ఇందర్ దత్‌ లఖన్‌పాల్, దేవిందర్ కుమార్, రవి ఠాకూర్, చేతన్య శర్మ ఉన్నారు. బుధవారం సభలో ఆర్థిక బిల్లుపై ఓటింగ్ సందర్భంగా ప్రభుత్వ విప్‌ను ధిక్కరించినందుకు ఈ ఆరుగురు ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించారు స్పీకర్ కుల్దీప్ సింగ్ పఠానియా. మరోవైపు 15 మంది బీజేపీ ఎమ్మెల్యేలను స్పీకర్ సస్పెండ్ చేయడంతో బడ్జెట్‌కు ఆ రాష్ట్ర అసెంబ్లీ ఆమోదం తెలిపింది.

First Published:  29 Feb 2024 7:16 AM GMT
Next Story