Telugu Global
National

ఆయన 'డెత్ మర్చెంట్'... మోడీపై నిప్పులు చెరిగిన గుజరాత్ మాజీ సీఎం

సోమవారం ఓటింగ్‌కు ముందు వాఘేలా మాట్లాడుతూ, ఈసారి గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓటమి ఖాయమని అన్నారు. బీజేపీ, మోడీ ప్రజలను రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారని, అయితే గుజరాత్ ప్రజలకు అన్నీ అర్థమవుతున్నాయన్నారు.

ఆయన డెత్ మర్చెంట్... మోడీపై నిప్పులు చెరిగిన గుజరాత్ మాజీ సీఎం
X

ప్రధాని మోడీ 'డెత్ మర్చెంట్' (మరణాల‌ వ్యాపారి) అని గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి శంకర్ సింగ్ వాఘేలా నిప్పులు చెరిగారు. ఆయన గోద్రాలో అంత్యక్రియల ఊరేగింపు చేయబోతున్నాడని మండి పడ్డారు.

గతంలో సోనియా గాంధీ కూడా మోడీని 'మరణాల వ్యాపారి' అని విమర్శించారు. ప్రస్తుతం గుజరాత్ లో రెండవ‌ దశ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో మరో సారి 'మరణాల వ్యాపారి' నినాదం మారుమోగుతోంది.

సోమవారం ఓటింగ్‌కు ముందు వాఘేలా మాట్లాడుతూ, ఈసారి గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓటమి ఖాయమని అన్నారు. బీజేపీ, మోడీ ప్రజలను రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారని, అయితే గుజరాత్ ప్రజలకు అన్నీ అర్థమవుతున్నాయన్నారు.

''బీజేపీ ఎజెండాలో ద్వేషం తప్ప మరేమీ ఉండదు. మోడీ ఎప్పుడూ అభివృద్ధి, ఉపాధి, ద్రవ్యోల్బణం గురించి మాట్లాడలేదు. ప్రజలను తప్పుదోవ పట్టించారు. బీజేపీ ప్రభుత్వాన్ని ప్రజలు ఓడించదల్చుకున్నారని మొదటి దశ పోలింగ్‌లోనే తేలిపోయింది. ఇప్పుడు ప్రజలు మార్పు కోరుకుంటున్నారు.'' అని వాఘేలా అన్నారు.

శంకర్ సింగ్ వాఘేలా ప్రస్తుతం ఏ పార్టీలోనూ లేరు. అయితే, ఈయన కుమారుడు మహేంద్రసింగ్‌ వాఘేలా కాంగ్రెస్‌ టికెట్‌పై పోటీ చేస్తున్నాడు.

కాగా, మోదీని 'మరణాల‌ వ్యాపారి' అని 2007 లోనే సోనియాగాంధీ అభివర్ణించారు. మరోవైపు గుజరాత్‌ ఎన్నికల్లో మోడీకి తమ సత్తా ఏంటో చూపిస్తామంటూ కాంగ్రెస్‌ సీనియర్ నేత మధుసూదన్‌ మిస్త్రీ అనగా.. కాంగ్రెస్ నూతన‌ అధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గే మోదీని రావణుడితో పోల్చారు.

గుజరాత్‌లో నేడు రెండో దశ పోలింగ్ జరుగుతోంది. రాష్ట్రంలోని మొత్తం 93 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఈరోజు పోలింగ్ జరుగుతోంది. ప్రధాని మోదీ, అమిత్ షా ఇవాళ ఓటు వేశారు.

First Published:  5 Dec 2022 12:16 PM GMT
Next Story