Telugu Global
National

ప్రొటీన్ పౌడర్ తీసుకుని అతిగా జిమ్ చేస్తున్నారా..? అయితే ఇది మీకోసమే..

ఆస్పత్రికి తీసుకెళ్తే అతడికి ఆక్సిజన్ లెవల్స్ తక్కువ అయ్యాయని గుర్తించారు. అతిగా ప్రొటీన్ తీసుకుని, అతిగా ఎక్సర్ సైజ్ చేయడం వల్లే ఆ పరిస్థితి వచ్చిందని అన్నారు.

ప్రొటీన్ పౌడర్ తీసుకుని అతిగా జిమ్ చేస్తున్నారా..? అయితే ఇది మీకోసమే..
X

కొత్తగా జిమ్ కి వస్తున్నవారికి ముందుగా ట్రైనర్ ఇచ్చే సలహా ప్రొటీన్ పౌడర్ తీసుకోండి అని. అరగంట జిమ్ చేయగాని సహజంగా అలసట వస్తుంది. అందులోనూ కొత్తగా బరువులు ఎత్తడం మొదలు పెట్టేవారికి అరగంటలోపే నీరసం రావడం గ్యారెంటీ. అయితే జిమ్ లో కనీసం గంటన్నరసేపు గడపాలని, అలా ఉండాలంటే ప్రొటీన్ పౌడర్ తీసుకోవాలని చెబుతుంటారు. ఆ తర్వాత మెల్లగా మజిల్ సప్లిమెంట్లు అంటూ ట్యాబ్లెట్లు అలవాటు చేస్తారు కొంతమంది. ఒకసారి వాటికి అలవాటై, వాటి ద్వారా ఉండలు ఉండలుగా కండలు పెంచుకుంటూ పోతుంటే.. మధ్యలో ఎవరికీ ఆపేయాలని అనిపించదు. అదో వ్యసనంగా మారుతుంది. కానీ కొంతమందికి ఆ వ్యసనం ప్రాణాంతకం అవుతుంది. తాజాగా ఢిల్లీలో జరిగిన ఘటనే దీనికి ఉదాహరణ. 22 ఏళ్ల ఓ యువకుడు జిమ్ లోనే కుప్పకూలాడు, ప్రాణాపాయ స్థితిలో PSRI ఆస్పత్రిలో చేరాడు, ఐసీయూలో ఉంచిన వైద్యులు వారం రోజుల అబ్జర్వేషన్ తర్వాత పరిస్థితి చెబుతామన్నారు. అతను టాక్సిక్ ఎన్ సెపలోపతికి గురయ్యాడని తేల్చి చెప్పారు.

అసలేం జరిగింది.. ?

ఢిల్లీలో ఉన్న 22 ఏళ్ల ఓ కుర్రాడు ఇంటికి సమీపంలోని జిమ్ కి వెళ్తున్నాడు. అక్కడ ఇచ్చే ప్రొటీన్ పౌడర్ తోపాటు, జిమ్ సప్లిమెంట్ లు కూడా తీసుకుంటున్నాడు. రోజూలాగే జిమ్ కి వెళ్లిన ఆ కుర్రాడు గంట సేపు కఠినంగా వ్యాయామం చేసి ఒక్కసారిగా కుప్పకూలాడు. ఆస్పత్రికి తీసుకెళ్తే అతడికి ఆక్సిజన్ లెవల్స్ తక్కువ అయ్యాయని గుర్తించారు. అతిగా ప్రొటీన్ తీసుకుని, అతిగా ఎక్సర్ సైజ్ చేయడం వల్లే ఆ పరిస్థితి వచ్చిందని అన్నారు.

అతి వ్యాయామం వల్ల వచ్చే కండరాల సమస్యలు కూడా అతడిలో కనపడ్డాయి. ఓవైపు డైట్ కంట్రోల్ చేస్తూ, కేవలం ప్రొటీన్ సప్లిమెంట్ మాత్రమే తీసుకుంటూ వ్యాయామం చేయడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయంటున్నారు నిపుణులు. కార్డియాక్ అరెస్ట్ అనేది వ్యాయామం చేసినా, చేయకపోయినా సడన్ గా వచ్చే ఇబ్బంది. కానీ జిమ్ లో వ్యాయామం చేస్తూ, ఇతర ఆహారం జోలికి వెళ్లకుండా కేవలం జిమ్ లో ఇచ్చే సప్లిమెంట్లమీద బతికేస్తామంటే ఇలాంటి సమస్యలే వస్తాయని హెచ్చరిస్తున్నారు వైద్యులు.

First Published:  20 Feb 2023 2:03 PM GMT
Next Story