Telugu Global
National

పాత వంతెన కూల్చివేత సమయ‍ంలో ప్రమాదం... వంతెన కూలి నదిలో పడిపోయిన జేసీబీ

గుజరాత్ లోని కాంక్రెజ్ తాలూకా, ఉంబ్రి గ్రామం సమీపంలోని ఈ వంతెన దాదాపు 70 ఏళ్లనాటిదని, ఇది గత నాలుగు సంవత్సరాలుగా వినియోగంలో లేదని రాష్ట్ర రోడ్లు,భవనాల శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కల్పేష్ పటేల్ తెలిపారు.

పాత వంతెన కూల్చివేత సమయ‍ంలో ప్రమాదం... వంతెన కూలి నదిలో పడిపోయిన జేసీబీ
X

ఓ పాత వంతెనను కూల్చివేస్తుండగా అది హటాత్తుగా కూలిపోయి దాని మీదున్న జేసీబీ, ఆపరేటర్ తో సహా 30 అడుగుల కిందికి నీళ్ళు లేని నదిలో పడిపోయింది. ఆపరేటర్ స్వల్ప గాయాలతో బైటపడ్డాడు.

గుజరాత్ లోని కాంక్రెజ్ తాలూకా, ఉంబ్రి గ్రామం సమీపంలోని ఈ వంతెన దాదాపు 70 ఏళ్లనాటిదని, ఇది గత నాలుగు సంవత్సరాలుగా వినియోగంలో లేదని రాష్ట్ర రోడ్లు,భవనాల శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కల్పేష్ పటేల్ తెలిపారు.

అదే స్థలంలో కొత్త వంతెన నిర్మాణానికి ప్రభుత్వం ఆమోదం తెలిపిందని, అందుకే పాత వంతెన కూల్చేస్తున్నామని పటేల్ చెప్పారు. ఇప్పటికే చాలా భాగాన్ని కూల్చేశారు.

రెండు స్తంభాలను కలుపుతూ మిగిలిన ఉన్న ఒక భాగాన్ని కూల్చివేసేందుకు శుక్రవారం వంతెన పైభాగంలో హైడ్రాలిక్ సుత్తితో కూడిన జేసీబీని ఉపయోగించారు. కూల్చి వేత జరుగుతున్నప్పుడు హటాత్తుగా వంతెన భాగం కూలిపోయి జేసీబీ కిందికి పడిపోయింది.

"జేసీబీ వంతెన పైన ఉన్నప్పుడు వంతెనపై పగుళ్లు ఏర్పడ్డాయి. అలా జరుగుతుందని , వంతెన కూలిపోతుందని ఆపరేటర్ ఊహించలేదు. అదృష్టవశాత్తూ ఈ ఘటనలో అతనికి ఎలాంటి గాయాలు కాలేదు' అని ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పటేల్ తెలిపారు.

First Published:  17 Dec 2022 4:24 PM GMT
Next Story