Telugu Global
National

గుజరాత్ ఎన్నికల షెడ్యూల్ విడుదల

రెండు విడతల ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్లు నవంబర్‌ 5, 10 తేదీల్లో విడుదలవుతాయి. నవంబర్‌ 14 వరకు తొలి దశ నామినేషన్ల‌ను, 17వ తేదీ వరకు రెండో విడత ఎన్నికలకు సంబంధించి నామినేషన్లు స్వీకరిస్తారు.

గుజరాత్ ఎన్నికల షెడ్యూల్ విడుదల
X

గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్‌ను ప్రకటించింది. రెండు విడతల్లో ఎన్నికలు జరుగుతాయి. తొలి విడత డిసెంబర్‌ 1న, రెండో విడత ఎన్నికల పోలింగ్ డిసెంబర్ 5న నిర్వహిస్తారు. డిసెంబర్ 8న కౌంటింగ్ ఉంటుంది.

రెండు విడతల ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్లు నవంబర్‌ 5, 10 తేదీల్లో విడుదలవుతాయి. నవంబర్‌ 14 వరకు తొలి దశ నామినేషన్లు స్వీకరిస్తారు. ఈనెల 17 వరకు రెండో విడత ఎన్నికలకు సంబంధించి నామినేషన్లు స్వీకరిస్తారు.

గుజరాత్‌తో మొత్తం 182 అసెంబ్లీ స్థానాలున్నాయి. ఫిబ్రవరి 18తో గుజరాత్ ప్రస్తుత అసెంబ్లీ పదవీకాలం ముగుస్తుంది. గుజరాత్‌లో మొత్తం ఓటర్ల సంఖ్య 4.9 కోట్లు. 51, 782 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. ఈసారి బీజేపీ, ఆప్‌, కాంగ్రెస్ మధ్య హోరాహోరీగా పోరు నడిచే సూచనలున్నాయి. ప్రధాని సొంత రాష్ట్రం కావడంతో గుజరాత్ ఎన్నికలపై అందరి దృష్టి ఉంది. ఈసారి ఆప్‌ తనదైన శైలిలో దూసుకుపోతోంది. ఆప్‌ హామీలు ప్రజలను బాగా ఆకట్టుకుంటున్నాయి.

First Published:  3 Nov 2022 7:26 AM GMT
Next Story