Telugu Global
National

పెళ్లి పీటలపై నిద్రపోయిన వరుడు.. పెళ్లికూతురు ఏం చేసిందంటే..!

నల్ బరి జిల్లాకు చెందిన ప్రసేన్ జీత్ హలోయ్ అనే యువకుడికి ఓ యువతితో పెళ్లి నిశ్చయం అయింది. పెళ్లిరోజు రానే వచ్చింది. ఓ కళ్యాణ మండపంలో వివాహానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.

పెళ్లి పీటలపై నిద్రపోయిన వరుడు.. పెళ్లికూతురు ఏం చేసిందంటే..!
X

పెళ్లి మండపాన్ని అందంగా ముస్తాబు చేశారు. వివాహ తంతును చూసేందుకు బంధువులు భారీగా తరలివచ్చారు. పురోహితుడు మంత్రాలు చెబుతుండగా మరోవైపు మేళ తాళాలు మోగుతున్నాయి. అయితే తాళి కట్టేందుకు వరుడు మాత్రం సిద్ధంగా లేడు. ఎందుకంటే.. పెళ్లి పీటలపైనే అతడు నిద్రపోతున్నాడు. ఇటువంటి వాడినా.. నేను పెళ్లి చేసుకోవాల్సింది అని..పెళ్లి కూతురుకు చిర్రెత్తుకొచ్చింది. పెళ్లి పీటల నుంచి లేచి వెళ్లిపోయింది. ఈ సంఘటన అస్సోం రాష్ట్రంలో జరిగింది.

నల్ బరి జిల్లాకు చెందిన ప్రసేన్ జీత్ హలోయ్ అనే యువకుడికి ఓ యువతితో పెళ్లి నిశ్చయం అయింది. పెళ్లిరోజు రానే వచ్చింది. ఓ కళ్యాణ మండపంలో వివాహానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. వధువు పెళ్లికూతురిగా ముస్తాబయింది. అంతలో అక్కడికి పెళ్లి కుమారుడు వచ్చాడు. వచ్చి రాగానే వింతగా ప్రవర్తించడం మొదలుపెట్టాడు. అతడిని చూడగానే అర్థమైంది ఫుల్ గా మద్యం సేవించి పెళ్లి మండపం వద్దకు వచ్చాడని. అతడి తీరు చూసి భయపడి పోయిన వధువు అతడిని పెళ్లి చేసుకోనని పెద్దలకు చెప్పేసింది. పెళ్లికి వచ్చిన వారంతా కూడా పెళ్లికూతురి నిర్ణయానికి మద్దతుగా నిలిచారు.

అయితే ఆమె తల్లిదండ్రులు మాత్రం యువతిని పెళ్లికి ఒప్పించారు. పెళ్లి పీటల మీద కూర్చోబెట్టారు. అఇష్టంగానే పెళ్లికూతురు అక్కడ కూర్చుంది. పురోహితుడు వచ్చి పెళ్లి మంత్రాలు చదవడం ప్రారంభించాడు. మరో పక్క పెళ్లి బాజాలు మోగుతున్నాయి. అయితే ఇవేమి పట్టించుకునే స్థితిలో పెళ్ళికొడుకు లేడు. అతడు పెళ్లి పీటలపైనే నిద్రపోతున్నాడు. దీంతో ఆగ్రహించిన వధువు తనకీ పెళ్లి వద్దని పెళ్లి పీటల నుంచి వెళ్లిపోయింది. అంతటితో ఆగని ఆమె తల్లిదండ్రులతో కలిసి నల్ బరి పోలీస్ స్టేషన్ కు చేరుకుంది. పెళ్ళికొడుకు కుటుంబం నుంచి పరిహారం ఇప్పించాలని ఫిర్యాదు చేసింది.

First Published:  12 March 2023 4:01 AM GMT
Next Story