Telugu Global
National

పంజాబ్ లో పోలీస్ స్టేషన్‌పై గ్రెనేడ్ దాడి... టెర్రరిస్టు లింకుల‌పై అనుమానాలు !

పాకిస్థాన్ ఇంటెలిజెన్స్ విభాగం ఐఎస్ఐ ప్రాపకంతో, పని చేస్తున్న ఖలిస్థాన్ ఉగ్రవాదులు ఈ దారుణానికి పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. గ్యాంగ్‌స్టర్, ఖలిస్థానీ ఉగ్రవాది హర్వీందర్ సింగ్ వురఫ్ రిండా హత్యకు ప్రతిస్పందనగా పోలీస్ స్టేషన్‌పై దాడి జరిగినట్లు అనుమానిస్తున్నారు.

పంజాబ్ లో పోలీస్ స్టేషన్‌పై గ్రెనేడ్ దాడి... టెర్రరిస్టు లింకుల‌పై అనుమానాలు !
X

పంజాబ్‌లోని తరన్ తరన్ పోలీస్ స్టేషన్‌పై శుక్రవారం అర్ధరాత్రి దాటిన త‌ర్వాత రాకెట్ ప్రొపెల్డ్ గ్రెనేడ్ దాడి జరిగింది. ఇది ఈ పోలీస్ స్టేషన్ భవనం వెలుపల ఉన్న ఓ స్తంభానికి తగిలి, వెనుకకు వెళ్ళడంతో పెద్ద ప్ర‌మాదం త‌ప్పింద‌ని ఎటువంటి హాని జ‌ర‌గ‌లేద‌ని అధికారులు తెలిపారు. సంఘ‌ట‌న విష‌యం తెలుసుకున్న పంజాబ్ డీజీపీ గౌరవ్ యాదవ్, ఫోరెన్సిక్ బృందాలు హుటాహుటిన అక్క‌డికి చేరుకున్నాయి.

పాకిస్థాన్ ఇంటెలిజెన్స్ విభాగం ఐఎస్ఐ ప్రాపకంతో, పని చేస్తున్న ఖలిస్థాన్ ఉగ్రవాదులు ఈ దారుణానికి పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. గ్యాంగ్‌స్టర్, ఖలిస్థానీ ఉగ్రవాది హర్వీందర్ సింగ్ వురఫ్ రిండా ఇటీవల పాకిస్థాన్‌లో హత్యకు గురయ్యాడనే వార్త‌లు వ‌చ్చాయి. ఈ హత్యకు బాధ్యత తమదేనని మరో గ్యాంగ్‌స్టర్ దవీందర్ బంబిహ గ్రూప్ ప్రకటించింది. రిండా హత్యకు ప్రతిస్పందనగా పోలీస్ స్టేషన్‌పై దాడి జరిగినట్లు అనుమానిస్తున్నారు.

పంజాబ్‌లో ఉగ్రవాదాన్ని సజీవంగా ఉంచడం కోసం పాకిస్థాన్ ఐఎస్ఐ ఈ దాడి చేయించినట్లు అనుమానిస్తున్నారు. పంజాబ్‌లోని మొహాలీలో పోలీస్ ఇంటెలిజెన్స్ కార్యాలయంపై ఆర్‌పీజీ దాడి కేసులో రిండా ప్రధాన సూత్రధారి. కాగా పాకిస్తాన్ స‌రిహ‌ద్దుల్లో ఉన్న ప్రాంతంలో రాకెట్ దాడులు జ‌ర‌గ‌డం ప‌ట్ల పోలీసులు, నిఘా వ‌ర్గాలు అప్ర‌మ‌త్త‌మ‌య్యాయి. పంజాబ్ లోని ఆప్ ప్రభుత్వంపై బిజెపి ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది.

First Published:  10 Dec 2022 6:08 AM GMT
Next Story