Telugu Global
National

బీజేపీ పాలిత రాష్ట్రాల్లోని రేషన్ షాపుల్లో అత్యధిక ధాన్యం కల్తీ

గుజరాత్‌లో 757 సివిల్ కేసులు,రూ. 3.96 కోట్లు జరిమానా, 71 క్రిమినల్ కేసులు, రూ. 3.27 లక్షల జరిమానాలను విధించారని కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజాపంపిణీ శాఖ మంత్రి పీయూష్ గోయల్ చెప్పారు. అదేవిధంగా ఉత్తరప్రదేశ్‌లో 7,781 సివిల్ కేసులు, 2,694 క్రిమినల్ కేసులు నమోదయ్యాయని వివరించారు.

బీజేపీ పాలిత రాష్ట్రాల్లోని రేషన్ షాపుల్లో అత్యధిక ధాన్యం కల్తీ
X

అనేక బిజెపి పాలిత రాష్ట్రాల్లో రేషన్ షాపుల్లో పెద్ద ఎత్తున ఆహార ధాన్యాలలో కల్తీ జరుగుతోంది. ఈ మేరకు పెద్ద సంఖ్యలో సివిల్, క్రిమినల్ కేసులను నమోదు అవుతున్నాయని కేంద్రం ప్రకటించింది.

కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజాపంపిణీ శాఖ మంత్రి పీయూష్ గోయల్ బుధవారం లోక్‌సభలో మాట్లాడుతూ, 2021-22 ఆర్థిక సంవత్సరంలో రేషన్ షాపుల్లో ఆహార ధాన్యాల కల్తీకి సంబంధించి గుజరాత్‌లో 757 సివిల్ కేసులు,రూ. 3.96 కోట్లు జరిమానా, 71 క్రిమినల్ కేసులు, రూ. 3.27 లక్షల జరిమానాలను విధించారని చెప్పారు. అదేవిధంగా ఉత్తరప్రదేశ్‌లో 7,781 సివిల్ కేసులు, 2,694 క్రిమినల్ కేసులు నమోదయ్యాయని వివరించారు.

తెలంగాణలో 353 సివిల్ కేసులు, 32 క్రిమినల్ కేసులు నమోదు కాగా, సివిల్ కేసులకు సంబంధించి రూ.8.77 లక్షల పెనాల్టీలు విధించారు.

First Published:  31 March 2023 2:25 AM GMT
Next Story